జాజికాయ సాధారణంగా అందరికి తెలిసిందే. కాని జాజికాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. కానీ అదే విత్తనాలు కూడా ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చిన్న విత్తనాలు కూడా భారీ ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి నగ్గె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ కథనంలో చూద్దాం.
మంచి నిద్రకు దోహదపడుతుంది
జాజికాయ గింజలను వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టి పడుకునే ముందు ఆ నీటిని తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఒక చెంచా తేనెను చిటికెడు జాజికాయ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగండి. బాగా నిద్రపడుతుంది. చాలా మంది పడుకోటానికి ముందు ఒక గ్లాసు తాగుతుంటారు. అలాంటి వారు మంచి నిద్ర కోసం ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయపొడి కలుపుకొని తాగితే మంచిదంట.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు
జాజికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్యుల సలహా మేరకు నిత్యం గింజలను తీసుకోవడం చాలా మంచిది. ఇది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అందువల్ల అధిక రక్తపోటుకు కూడా ఇది మంచి ఔషధం.
సౌదర్యానికి
ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశంవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది
శరీరంలోని ఆక్సిడైజ్డ్ లిపిడ్ల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే గుండె కణజాలాన్ని స్ట్రక్చరల్ డ్యామేజ్ నుండి రక్షిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని నిరూపించారు.
సెక్స్ కోరికలు
జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవించాలి. ఇది సంతాన లేమిని తొలగిస్తుంది. మగవారిలో నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. జాజికాయలో సెక్స్ కోరికలు పెంచే గుణాలున్నాయంట. మగవారు ఆ సమయంలో దీన్ని తీసుకుంటే అందులో బాగా పార్టిసిపేట్ చేయొచ్చంట. వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంట.
చర్మ ఆరోగ్యం కోసం
నగ్జి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ పుష్కలంగా ఉంటాయి. చర్మ సంరక్షణలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సీడ్ ఆయిల్ చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణలో దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై దద్దుర్లు పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది.