వేడివేడి అన్నంలో ముద్ద పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరంటారు చాలామంది. అయితే చాలామంది నెయ్యిలో చాలా కేలరీలు ఉంటాయని.. నెయ్యి తింటే వెయిట్ పెరిగిపోతామని దానిని తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ,ఇది అపోహ మాత్రమే నని రోజూ రెండు, మూడు చుక్కల నెయ్యి అయినా తినాలని ఆయుర్వేద నిపుణులతో పాటు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో రెండు, మూడు చుక్కల నెయ్యి కలుపుకొని తింటే.. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా.. గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధ పడినవారికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నెయ్యిలో పోషకాల మోతాదు ఎక్కువే ఉంటుందట. ముఖ్యంగా నెయ్యిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
అంతేకాదు, నెయ్యి నుంచి మన శరీరానికి అందే మంచి కొవ్వులు అధికబరువుని కూడా అదుపులో ఉంచుతాయట. దీంతో పాటు నెయ్యిలో ఉండే విటమిన్ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. అలాగే మహిళల హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా వుండేవారు , నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ ఒక స్పూర్ నెయ్యివేసుకుని తింటే.. ఇది అధిక రక్తస్రావాన్నీ, నొప్పులనీ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నెయ్యిలో ఉండే బ్యూటెరిక్ ఆమ్లం వృద్ధులలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే నెయ్యిలో కాల్షియం కూడా కావాల్సినంత మోతాదులో ఉంటుంది. దీనివలన దంత, ఎముక సంబంధిత సమస్యలను తగ్గించడంలో నెయ్యి ముందు ఉంటుంది. అలాగే ఒంట్లోని మలినాలను కూడా పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించేముందు మీ వైద్యుల సలహా తీసుకొని పాటించడం మంచిది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE