తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు

Mango News, Telangana CET Exams Dates, Telangana CETs schedule released, Telangana Common Entrance Exams, Telangana Common Entrance Exams Dates, Telangana Common Entrance Exams Dates Finalized, Telangana EAMCET ECET ICET and other Common Entrance Exams Dates Finalized, Telangana EAMCET ECET ICET Exams Dates Finalized, Telangana Fresh schedule for CETs announced, TS CETs 2021, TS CETs 2021 Latest Updates, ts eamcet 2021 dates

రాష్ట్రంలో ఎంసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం నాడు తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిత్తల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేశారు.

ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేయాలి:

ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారం నుంచి ప్రారంభించి మాసాంతంలోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్ లాగ్లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలను కోవిడ్-19 నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  1. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – ఆగస్టు 4,5,6
  2. ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్ – ఆగస్టు 9,10
  3. ఈసెట్‌ – ఆగస్టు 3
  4. పీజీ ఈసెట్‌ – ఆగస్టు 11 నుంచి 14 వరకు
  5. ఐసెట్ – ఆగస్టు 19,20
  6. లా సెట్ – ఆగస్టు 23
  7. ఎడ్ సెట్ – ఆగస్టు 24,25
  8. పాలీ సెట్ – జులై 17
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =