ఆసీస్ అంటే క్రికెట్ దూకుడుగా ఆడటంలోనే కాదు స్లెడ్జింగ్ చేయడంలో మైండ్ గేమ్‌లు ఆడటంలో సిద్దహస్తులు. స్లెడ్జింగ్ లో వారిని మించిన వారు క్రికెట్ లో మరొ జట్టు లేదు. వారి తరువాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ విద్యలో ఆరితేరారు. మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య మాటల ఆటే ఎక్కువ. యాషెస్ సిరీస్ మాత్రమే కాదు. ఆస్ట్రేలియన్ భాషలో ఆస్ట్రేలియన్లకు సమాధానం చెప్పగల జట్టు ఏదైనా ఉందంటే అది ఇంగ్లండ్ మాత్రమే. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. దీన్ని గేమ్‌లో భాగం చేసిన ఘనుడు రికీ పాంటింగ్.
ప్రతిచోటా ఇంగ్గీషు భాషలోనే కమ్యూనికేషన్ జరుగుతుంది. కానీ కంగారూలు భారత్, పాకిస్థాన్‌లతో ఆడినప్పుడు వారికి భాష సమస్య తలెత్తుంతుంది. మైదానంలో ఆస్ట్రేలియన్లు ఏం మాట్లాడినా, ఫిర్యాదు చేసినా భారత ఆటగాళ్లందరికీ అర్థమవుతుంది. పాకిస్థాన్ జట్టులో అర్థం కాని వారు ఇంగ్లీష్ తెలిసిన తోటి ఆటగాళ్ల నుంచి నేర్చుకుని తగిన సమాధానం ఇస్తారు.
అయితే ఆస్ట్రేలియా జట్టుకు ఓ సమస్య వచ్చింది. ఎందుకంటే టీమ్ ఇండియా హిందీలో, పాకిస్థాన్ ఉర్దూలో మాట్లాడితే ఈ కంగారూలకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. పాకిస్థానీయులు ఇంగ్లీషు మిక్స్ చేసి మాట్లాడినా వారు ఏం అన్నారో దేవుడి తెలియాలి. ఇటు టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ వెనుక సారథిగా ఉంటూ ఎన్ని మాట్లాడిన వారికి ఒక్క ముక్క అర్థం కాదు. ఇక రిషబ్ పంత్ అయితే ప్రతి బంతికి నోటికి పని చెపుతాడు.
ఇప్పుడు హిందీ-ఉర్దూ భాషల్లో ఆస్ట్రేలియన్లకు మైదానంలో తగిన సమాధానం చెప్పకపోతే మనోళ్లకు కూడా ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే హర్భజన్ సింగ్ ఏదో అన్నాడు, సైమండ్స్ ఇంకేదో అడగడంతో కంగారు పడ్డాడు. నేనెప్పుడూ అలా అనలేదని ఐసీసీ ప్యానెల్‌కు అర్థమయ్యేలా చెప్పడం హర్భజన్ వంతయింది.
మొత్తానికి ఆస్ట్రేలియా గత ఘటనలను సీరియస్ గా తీసుకుంది. సాధారణంగా హిందీ, ఉర్దూ నేర్చుకుంటే ఇబ్బంది ఉండదని భావిస్తోంది. గత దశాబ్ద కాలంగా, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపిఎల్ ఆడటానికి భారతదేశానికి వస్తున్నారు, కాబట్టి కొద్దిమందికి హిందీ అర్థం అవుతుంది. కొన్ని పదాలు వారికి తెలుస్తున్నాయి.
ఈ విషయంలో ఒక భాషను పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉన్నా.. కొన్ని పదాలను గుర్తుపెట్టుకున్నా.. దాని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా కొన్ని హిందీ, ఉర్దూ పదాలను గుర్తు ఉంచుకుంటున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల తన అధికారిక X ఖాతాలో ఒక చిన్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. అందులో, ఆసీస్ ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్ మరియు మిచెల్ మార్ష్ హిందీ పదాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆరు, కమాన్ లాడ్స్, గో అప్, ఇట్స్ అవుట్, కీప్ గోయింగ్, బౌండరీ మొదలైన వాటిని హిందీలో నేర్చుకుంటున్నారు.
ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లుకు తెలియకుండా భారత్, పాక్ జట్లు గ్రౌండ్ లో వేరే భాషలో మాట్లాడటం బెటర్. ఒకప్పుడు టీమ్ ఇండియాలో ముంబై వాసులు ఎక్కువగా ఉండేవారు అందువల్ల మరాఠీ ఎక్కువగా మాట్లాడేవారు. ఇప్పుడు మరో ప్రాంతీయ భాషలో కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ సభ్యులతో కమ్యూనికేట్ చేయడం బెటర్.