అన్ని రకాల భారత్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప

Robin Uthappa Announces Retirement from All forms of Cricket , Robin UthappaAnnounces Retirement From ODI, Robin Uthappa Announces Retirement, Mango News, Mango News Telugu, Robin Uthappa , Robin Uthappa Announces Retirement, Robin Uthappa Announces Retirement , Robin Uthappa , Indian Player Robin Uthappa , Robin Uthappa Announces Retirement, Robin Uthappa Latest News And Updates, ODI Cricket News And Live Upadtes, Robin Uthappa Retire In All Forms Of Cricket, Robin Uthappa Retired,

టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, భారత్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టుగా బుధవారం ప్రకటన చేశాడు. “నా దేశానికి మరియు నా కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం నాకు గొప్ప గౌరవం. అయితే అన్ని మంచి విషయాలు ముగియాలి మరియు నేను అన్ని రకాల భారత్ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను” అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. అలాగే తన క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, కర్ణాటక సహా ఇతర క్రికెట్ అసోసియేషన్లకు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, పూణే వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీల యాజమాన్యాలకు, క్రికెట్ అభిమానులకు ఊతప్ప కృతజ్ఞతలు తెలిపాడు. ముందుగా ఏప్రిల్ 09, 2006న నెహ్రూ స్టేడియంలో ఇంగ్లాండ్ తో వన్డే మ్యాచ్ తో రాబిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక చివరిసారిగా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 19, 2015న జింబాబ్వేపై టీ20 మ్యాచ్ ఆడాడు.

36 సంవత్సరాల ఊతప్ప భారత్ తరపున మొత్తం 46 వన్డేలు, 13 టీ-20 మ్యాచ్‌ లు ఆడాడు. 46 వన్డేల్లో 6 హాఫ్ సెంచరీలతో 934, 13 టి-20ల్లో ఒక హాఫ్ సెంచరీతో 249 పరుగులు చేశాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌ ను గెలిచిన భారత్ జట్టులో ఊతప్ప సభ్యుడుగా ఉన్నాడు. కాగా ఐపీఎల్ లో 205 మ్యాచుల్లో 27 హాఫ్ సెంచరీలతో, 130.35 స్ట్రైక్ రేట్ తో 4952 పరుగులు చేశాడు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 15 ఐపీఎల్ సీజన్లలో రాబిన్ ఊతప్ప ఆడగా, ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =