చెపాక్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (51*) అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. మరో ఎండ్‌లో షకీబ్ అల్ హసన్ నాలుగో రోజు ముగుస్తుందనగా బ్యాటింగ్ కి వచ్చాడు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 357 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు శుభమన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (109; 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీల సాయంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 287/ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యంతో సహా బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మ్యాచ్ మూడో రోజు భారత్ తరఫున ధనాధన్ బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ అద్భుత సెంచరీ సాధించాడు. అలాగే రిషబ్ పంత్‌కి సంబంధించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం భారత జట్టు 81 పరుగులకే మూడో రోజు ఆట ప్రారంభించింది. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ సానుకూలంగా బ్యాటింగ్ చేశారు. మంచి డెలివరీలను గౌరవిస్తూ చెడ్డ బంతులను ఫోర్లు, సిక్సర్లతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. పత్ 124 బంతుల్లో సెంచరీ సాధించగా, గిల్ 161 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ చేసిన ఓ పని వైరల్‌గా మారింది. క్రీజులో ఉన్న పంత్ బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్‌కు సహకరిస్తాడు.
బంగ్లా ఫీల్డ్ సెట్‌లో పంత్ సహాయం చేశాడు
బంగ్లాదేశ్ ఫీల్డర్లు గిల్-పంత్‌పై నిస్సహాయంగా కనిపించారు. ఈ సమయంలో, పంత్ వారిలో ఉత్సాహాన్ని నింపాడు. ‘అరే.. ఒకరు ఇటువైపు, మరొకరు అటువైపు వెళ్తారు. ఒకరు ఇక్కడ, మరొకరు మిడ్ వికెట్ వద్ద’ అని బంగ్లాదేశ్ ఫీల్డర్లకు పంత్ సలహా ఇచ్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో కూడా పంత్ మాట విని మిడ్ వికెట్ వద్ద ఫీల్డర్‌ని సెట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో గతంలొ జరిగిన ఓ మ్యాచ్‌లో, MS ధోని కూడా ఇదే విధంగా ఫీల్డింగ్ సెట్‌లో సహాయం చేశాడు.
Always in the captain’s ear, even when it’s the opposition’s! 😂👂
Never change, Rishabh Pant! 🫶🏻#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/PgEr1DyhmE
— JioCinema (@JioCinema) September 21, 2024