టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకం సాధించిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా

Bajrang Punia vs Daulet Niyazbekov Men’s 65kg Wrestling Bronze Medal Match HIGHLIGHTS, Bajrang Punia Wins Bronze, Bajrang Punia wins bronze medal, Bajrang Punia wins Olympic wrestling bronze, Bajrang Punia wins wrestling bronze at Tokyo Olympics, Brave Bajrang Punia wins bronze for India, India Medals Count Reaches to 6, Indian Wrestler Bajrang Punia, Indian Wrestler Bajrang Punia Wins Bronze, Mango News, Tokyo Olympics, Tokyo Olympics Wrestling

టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో శనివారం సాయంత్రం కాంస్య పతకం కోసం కజకిస్తాన్ కు చెందిన దౌలెట్ నియాజ్బెకోవ్ తో జరిగిన మ్యాచ్ లో భజరంగ్ పూనియా సంచలన విజయం సాధించాడు. మొదటి పీరియడ్ లో 2-0 తో ముందంజలో ఉన్న భజరంగ్ పూనియా, రెండు పీరియడ్ లో కూడా పూర్తి ఆధిపత్యం చూపించి 8-0 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి కాంస్య పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు (రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు) చేరుకుంది.

మరోవైపు ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన ఆరో భారత రెజ్లర్ గా భజరంగ్ పూనియా నిలిచాడు. అంతకుముందు 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో కెడి జాదవ్ (కాంస్యం), సుశీల్ కుమార్ 2008 బీజింగ్ లో (కాంస్యం), 2012 లండన్ లో (రజతం), 2012 లండన్ లో యోగేశ్వర్ దత్ (కాంస్యం) మరియు 2016 రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ (కాంస్యం), 2020 టోక్యో ఒలింపిక్స్ లో రవి కుమార్ దహియా (రజతం) సాధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =