భారత జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. అయితే జట్టు సారథి రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దే డెలివరీ కారణంగా మొదటి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నాడు. రోహిత్‌కు మగబిడ్డ జన్మించడం తో పితృత్వాన్ని ఆస్వాదించేందుకు అతను భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో, జట్టు వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి టెస్ట్‌కు భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతంలో కూడా 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో బుమ్రా జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు, ఎందుకంటే శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో లేడు. బుమ్రా కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపిస్తూ, ఈ సిరీస్ మొత్తానికి అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు, రోహిత్ జట్టులో చేరతారని బీసీసీఐ అంచనా వేస్తోంది. రెండో టెస్ట్ కోసం దాదాపు తొమ్మిది రోజుల గ్యాప్ ఉండటంతో, రోహిత్ అప్పటికి అందుబాటులోకి వస్తారని సమాచారం.
ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ టీమిండియా కు కీలకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు అర్హత పొందేందుకు భారత్‌కు ఈ సిరీస్‌ను కనీసం 4-0 తేడాతో గెలవడం అవసరం. అంతకుముందు న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై ఓటమి టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా మారిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు ప్రతిష్ఠకు మాత్రమే కాకుండా, ప్రపంచ క్రికెట్‌లో తమ స్థిరస్థానాన్ని నిరూపించుకునే అవకాశంగా కూడా మారింది. బుమ్రా కెప్టెన్సీలో జట్టు విజయం సాధిస్తుందేమో వేచి చూడాలి.