టీ20 ప్రపంచ కప్‌: ఇండియా, పాకిస్తాన్ మధ్య నేడే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌

T20 World Cup 2022 Team India To Play First Match Against Pakistan in Super12 Today, T20 World Cup 2022, T20 India Vs Pakistan, India First Match Against Pakistan Super12, Mango News, Mango News Telugu, India Vs Pakistan Super12 Match, India Vs Pakistan Match Updates, India Vs Pakistan Match Live Score, Ind VS Pak, India Vs Pakistan, India Vs Pakistan Latest News And Live Updates, India Vs Pakistan Super12, Super12 Ind Vs Pak

క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కీలక తరుణం వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈరోజు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ తన మొదటి సూపర్ 12 గేమ్‌లో దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నేటి మ్యాచ్‌ను కూడా గెలుపుతో ఆరంభించాలనుకుంటోంది. ఇక పేస్‌కు అనుకూలించే మెల్‌బోర్న్‌ మైదానంలో లక్షమంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్న ఈ మ్యాచ్ టోర్నీలోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కానుంది.

గత ప్రపంచకప్‌లో భారత్ పాకిస్తాన్‌ చేతిలో దారుణ పరాజయం పాలైంది. దీనికి నేటి మ్యాచ్ ద్వారా బదులు తీర్చుకోవాలనుకుంటోంది. నేటి మ్యాచ్‌పై భారత్ కెప్టెన్ రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లను మార్చేందుకు మేం సిద్ధమే. మా దగ్గర ప్రత్యామ్నాయాలకు కొదవలేదు. గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోయామనే విషయం జట్టు సభ్యులందరి మదిలో ఉంది. గతాన్ని పక్కన పెట్టి సమిష్టిగా ముందుకు సాగాలనుకుంటున్నామని స్ఫష్టం చేశాడు. కెప్టెన్ రోహిత శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ, లోకేష్ రాహుల్‌, సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యా తదితరులు చెలరిగితే టీమిండియా విజయానికి ఢోకా లేదు.

అయితే బాబర్ అజామ్ సారధ్యంలోని పాకిస్తాన్ బౌలింగ్ దళం కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా పేసర్లు షాహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, రవూఫ్‌లు భారత్ టాపార్డర్‌పైనే దృష్టి సారించనున్నారు. అయితే నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీనిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిజర్వ్ డే లేకపోవడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. 2 పాయింట్లు పొందాలంటే కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. కాగా మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం గం. 1:30లకు మొదలవనుంది.

జట్లు అంచనా!

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్/రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్.

పాకిస్తాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 7 =