భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్‌ను గర్వించేలా చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 30 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన బుమ్రా, మెల్‌బోర్న్ టెస్టు అనంతరం ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని చేరాడు. 907 రేటింగ్ పాయింట్లు సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంతకుముందు భారత బౌలర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన రవి చంద్రన్ అశ్విన్ (904 పాయింట్లు) రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో తొమ్మిది వికెట్లు తీసిన బుమ్రా, 44 టెస్టులకే 200 వికెట్ల క్లబ్‌లో చేరి రెండో వేగవంతమైన భారత బౌలర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో 37 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన అశ్విన్ ఉన్నాడు.
అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ మాజీ పేసర్ డెరెక్ అండర్ వుడ్ (907 పాయింట్లు)తో సంయుక్తంగా ఈ స్థానాన్ని పంచుకుంటున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ బార్న్స్ (932 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో, బ్యాటర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ 4వ స్థానాన్ని సాధించగా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 20 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకులో నిలిచాడు.
గతేడాది తన అద్భుత ప్రదర్శనకు గాను బుమ్రా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) మరియు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల కోసం నామినేట్ అయ్యాడు. తాజా సిరీస్‌లో బుమ్రా హర్భజన్ సింగ్ పేరిట ఉన్న బీజీటీలో అత్యధిక వికెట్లు (32 వికెట్లు-2001) రికార్డును బద్దలు కొట్టే అవకాశముంది.
ప్రస్తుత సిరీస్‌లో 30 వికెట్లు తీసిన బుమ్రా, సిడ్నీ టెస్టులో ఈ రికార్డు బద్దలు కొడతాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తన జోరును కొనసాగిస్తూ బుమ్రా మరిన్ని రికార్డులను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
🚨 JASPRIT BUMRAH – INDIA'S HIGHEST RATED BOWLER IN HISTORY WITH 907 POINTS. 🚨 pic.twitter.com/M3CVxSYnrW
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2025