అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్

England Limited Overs Captain Eoin Morgan Announces Retirement from International Cricket, England Captain Eoin Morgan Announces Retirement from International Cricket, Captain Eoin Morgan Announces Retirement from International Cricket, Eoin Morgan Announces Retirement from International Cricket, Retirement from International Cricket, International Cricket Retirement, International Cricket, England Limited Overs Captain Eoin Morgan, Captain Eoin Morgan, England Limited Overs Captain, England, Eoin Morgan England men's limited-overs captain, England's leading run-scorer and most-capped player in both white-ball formats, Eoin Morgan International Cricket Retirement News, Eoin Morgan International Cricket Retirement Latest News, Eoin Morgan International Cricket Retirement Latest Updates, Eoin Morgan International Cricket Retirement Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా మంగళవారం నాడు ఇయాన్ మోర్గాన్ ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇయాన్ మోర్గాన్ ఒక గేమ్ ఛేంజర్ గా గుర్తింపు పొందాడు. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోనే ఇంగ్లాండ్ జట్టు 2019 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. అలాగే ఇంగ్లాండ్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మోర్గాన్ నిలిచాడు. ఇయాన్ మోర్గాన్ ముందుగా ఐర్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2006 నుండి 2009 వరకు మోర్గాన్ ఐర్లాండ్ తరపున 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేయగా, ఇందులో ఒక సెంచరీ మరియు ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక మే 2009 నుంచి ఇంగ్లాండ్ తరపున తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొత్తం 13 సంవత్సరాలపాటుగా ఇంగ్లాండ్ క్రికెట్ కు సేవలు అందించాడు. ‌

ఐర్లాండ్ తరపున కలుపుకుని మోర్గాన్ తన కెరీర్లో మొత్తం 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. 248 వన్డేల్లో 7701 పరుగులు చేయగా, అందులో 14 సెంచరీలు, 47 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక 16 టెస్టుల్లో 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 700 పరుగులు, 115 టీ20ల్లో 2458 పరుగులు చేశాడు. 2015 ప్రపంచ కప్‌కు ముందు అలిస్టర్ కుక్ నుండి మోర్గాన్ ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్సీని దక్కించుకున్నాడు. మొదట్లో బ్యాటింగ్ లో, కెప్టెన్సీలో తడబడినా అనంతరం జట్టులో కీలకంగా మారి, తన నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. మోర్గాన్ ఇంగ్లాండ్ తరపున 126 వన్డేలు మరియు 72 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 2 దేశాల తరపున ఆడి సెంచరీలు చేసిన ఆటగాడిగా మోర్గాన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇటీవల ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని మోర్గాన్ నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా జూన్ 19, 2022న నెదర్లాండ్స్‌ తో జరిగిన వన్డే మ్యాచ్ తో మోర్గాన్ క్రికెట్ కెరీర్ ముగిసింది. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన నిర్ణయం కాదని, కానీ తనకు వ్యక్తిగతంగా మరియు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం అని నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకున్నానని ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =