ఐపీఎల్ -2020 వేలం అప్‌డేట్స్‌

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Indian Premier League 2020 Auction, Indian Premier League 2020 Auction Live Updates, IPL 2020 Auction, IPL 2020 auction LIVE, IPL-2020 Auction Live Updates, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతాలో ప్రారంభమైంది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక వీరిలో 134 మంది క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌, 198 మంది అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ ఉన్నారు. అలాగే భారత్ ఆటగాళ్లు 186 మంది ఉండగా, విదేశీ క్రికెటర్లు 146 మంది ఉన్నారు. ఐపీఎల్‌ 2020 సీజన్లో ప్రస్తుతం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73 మంది క్రికెటర్లను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

ఆటగాళ్ల వేలం వివరాలు:

 • క్రిస్‌ లిన్‌ : రూ.2 కోట్లుకు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
 • ఇయాన్‌ మోర్గాన్‌ : కనీస ధర రూ.2 కోట్లు కాగా ‘రూ.5.25 కోట్లు’ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
 • రాబిన్‌ ఊతప్ప : కనీస ధర రూ.1.50 కోట్లు కాగా ‘రూ.3 కోట్లు’ కు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.
 • భారత ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, హనుమ విహారిని ఏ జట్టు ఎంచుకోలేదు.
 • జేసన్ రాయ్‌ : కనీస ధర ‘రూ.1.50 కోట్లు’ కి ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
 • ఆరోన్‌ పించ్‌ : కనీస ధర రూ.1 కోటి కాగా ‘రూ.4.4 కోట్లు’ కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు దక్కించుకుంది.
 • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ : కనీస ధర రూ.2కోట్లు కాగా ‘రూ.10.5 కోట్లు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ దక్కించుకుంది.
 • క్రిస్‌ వోక్స్‌ : కనీస ధర ‘రూ.1.50 కోట్లు’ కు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
 • యూసుఫ్ పఠాన్ ను ఏ జట్టు ఎంచుకోలేదు.
 • న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
 • ప్యాట్‌ కమ్మిన్స్‌ : ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ఈ సీజన్ లో సంచలనం సృష్టిస్తూ ‘రూ.15.50 కోట్లు’ పలికాడు. అతని కనీస ధర రూ.1.50 కోట్లు కాగా రూ.15.50 కోట్లుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
 • సామ్ కుర్రాన్ : కనీస ధర రూ.1కోటి కాగా ‘రూ.5.50కోట్లు’ కు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది.
 • క్రిస్‌ మోరిస్‌ : దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వేలంలో రూ.10 కోట్లు పలికాడు. కనీస ధర రూ.1.50 కోట్లు కాగా ‘రూ.10 కోట్లు’ కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు దక్కించుకుంది.
 • భారత్ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.

వికెట్ కీపర్లు: 

 • అలెక్స్‌ క్యారి : కనీస ధర రూ . 50 లక్షలు కాగా ‘రూ.2.4 కోట్లు’కు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
 • హెన్రిచ్ క్లాసేన్, ముష్ఫికర్ రెహ్మాన్, నామన్ ఓజా, కుసల్ పెరెరా, షై హోప్ లకు ఏ జట్టు బిడ్ దాఖలు చేయలేదు

బౌలర్లు:

 • మోహిత్ శర్మ, డేల్ స్టెయిన్, ఆండ్రూ టై, టీమ్ సౌథీ లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
 • జయదేవ్‌ ఉనద్కట్‌ : కనీస ధర రూ.1 కోటి కాగా ‘రూ.3కోట్లు’ కు రాజస్థాన్ రాయల్స్‌ దక్కించుకుంది.
 • నాథన్‌ కౌల్టర్‌నీల్‌ : కనీస ధర రూ.1 కోటి కాగా ‘రూ.8 కోట్లు’ కు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
 • షెల్డన్‌ కాట్రెల్‌ : కనీస ధర రూ.50 లక్షలు కాగా ‘రూ.8.50 కోట్లు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌
 • పీయూష్‌ చావ్లా : కనీస ధర రూ.1 కోటి కాగా ‘రూ.6.75 కోట్లు’ కు చెన్నె సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది.
 • ఐష్ సోధి, ఆడమ్ జాంపా, హయాడెన్ వాల్ష్ జూ, ఆఫ్గాన్ బౌలర్ జహీర్ ఖాన్ లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
 • రాహల్‌ త్రిపాఠి : కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.60 లక్షలు’ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.

మిగతా ఆటగాళ్లు:

 • విరాట్‌ సింగ్‌ : కనీస ధర రూ. 20 లక్షలు కాగా ‘రూ.1.90 కోట్లు’ కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది.
 • ప్రియమ్‌ గార్గ్‌ : కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.1.90 కోట్లు’ కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది.
 • దీపక్‌ హుడా : కనీస ధర రూ. 40 లక్షలు కాగా ‘రూ.50 లక్షలు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ దక్కించుకుంది.
 • వరుణ్‌ చక్రవర్తి : కనీస ధర రూ.30 లక్షలు కాగా ‘రూ.4 కోట్లు’ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
 • యశస్వి జైస్వాల్‌ : కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.2.40 కోట్లు’ కు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.
 • ఆ​కాశ్‌ సింగ్‌: కనీస ధర ‘రూ.20 లక్షలు’ కు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.
 • కార్తిక్‌ త్యాగి : కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.1.30 కోట్లు’ రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.
 • ఇషాన్‌ పోరేల్‌ : కనీస ధర ‘రూ.20 లక్షలు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ దక్కించుకుంది.
 • ఎం సిద్ధార్థ్‌ : కనీస ధర ‘రూ. 20 లక్షలు’ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
 • షిమ్రోన్‌ హెట్‌మైర్: కనీస ధర రూ.50 లక్షలు కాగా ‘రూ.7.75 కోట్లు’ కు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
 • డేవిడ్‌ మిల్లర్‌ : కనీస ధర ‘రూ.75 లక్షలు’ కు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.
 • రవి బిష్ణోయి : కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.1.80 కోట్లు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ దక్కించుకుంది.
 • మిచెల్‌ మార్ష్‌ : కనీస ధర ‘రూ.2 కోట్లు’ కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది.
 • జోష్‌ హాజల్‌వుడ్‌ : కనీస ధర ‘రూ.2 కోట్లు’ కు చెన్నె సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది.
 • జిమ్మీ నీషమ్‌ : కనీస ధర ‘రూ.50 లక్షలు’ కు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ దక్కించుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here