లండన్ : 2024 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ నయా సంచలనం… కార్లోస్ అల్కరాజ్ 6-2, 6-2, 7-6 (7-4)తో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించాడు. ఆల్ ఇంగ్లండ్ లండన్ క్లబ్ సెంటర్ కోర్ట్‌లో ఆదివారం జరిగిన హై వోల్టేజ్ ఫైనల్‌లో, దిగ్గజ నోవాక్ కొజోవిక్ కార్లోస్ అల్కరాజ్ ను నిలవరించలేకపోయాడు. సెంటర్ కోర్ట్‌లో అల్కరాజ్ జొకోవిచ్‌ను 2 గంటల 27 నిమిషాల్లో మట్టికరిపించాడు. గతేడాది వింబుల్డన్ ఫైనల్‌లో నొవాక్ జకోవిచ్‌ను ఓడించేందుకు కార్లోస్ అల్కరాజ్ 5 గంటల పాటు పోరాడాడు. అయితే ఈసారి అందులో సగంలోనే ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నం.1 ర్యాంక్‌ను దక్కించుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడు కార్లోస్ అల్కరాజ్.. 21 ఏళ్లలోపు 4 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచిన రికార్డును కూడా లిఖించాడు. దీంతో అతను దిగ్గజాలు యార్న్ బోర్గ్, బోరిస్ బెకర్, మాట్ విలాండర్‌ల రికార్డును సమం చేశాడు.
గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో అజేయంగా నిలిచిన అల్కరాజ్, వింబుల్డన్‌లో వరుసగా టైటిల్స్ గెలిచిన మొదటి స్పెయిన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫైనల్‌లో నొవాక్ జకోవిచ్ ట్రోఫీని గెలిస్తే వింబుల్డన్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ (8) రికార్డును సమం చేసి ఉండేవాడు. అయితే, అల్కరాజ్ దీనిని అనుమతించలేదు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో హోరాహోరీ పోరు సాగింది. అల్కరాజ్ 14 నిమిషాల పాటు పోరాడి తొలి బ్రేక్ పాయింట్ సాధించాడు. ముఖ్యంగా నొవాక్ 5 బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని అల్కరాజ్ తొలి సెట్‌ను 41 నిమిషాల్లోనే కైవసం చేసుకున్నాడు.
రెండో సెట్‌లోనూ అల్కరాజ్ తన సర్వీస్‌ను వదులుకోలేదు. ఒత్తిడిని జయించిన స్పెయిన్ క్రీడాకారుడు డబుల్ బ్రేక్ ద్వారా 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌కు చెమటలు పట్టించాడు. అల్కరాజ్ నోవాక్‌కి తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. మూడో సెట్‌లో నొవాక్ పుంజుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి… 4-5తో ముందంజలో ఉండగా అల్కరాజ్‌కు 3 ఛాంపియన్‌షిప్ పాయింట్లు లభించాయి. ఇక్కడ, నోవాక్ ఒక పాయింట్ సేవ్ చేయడమే కాకుండా, బ్రేక్ పాయింట్‌ను పొంది సమం చేశాడు. ఫలితంగా మూడో సెట్ టై బ్రేకర్‌కు వెళ్లింది. టై బ్రేక్‌లో అల్కరాజ్ ఒత్తిడిని ఎదుర్కొని 7-4తో విజయం సాధించి మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE