మ్యాచ్ టిక్కెట్ల విక్రయంలో మా ప్రమేయం లేదు, దానిని ‘పేటీయమ్’కు అప్పగించాం – హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌

HCA President Mohd Azharuddin Responds Over Yesterday's Stampede at Gymkhana Ground Issue, HCA President Azharuddin, Azharuddin on sale of match tickets, Azharuddin on tickets issue, Azharuddin says tickets are given to paytm, mango news, mango news telugu, Azharuddin on ind vs aus tickets issue, India vs Australia 2nd T20I, India vs Australia, 2nd T20I, IND vs AUS 2nd T20I, IND vs AUS 2022, India vs Australia T20 Series , India vs Australia T20 Match, Indian Captain Rohit Sharma, Australia Captain Aaaron Finch, India Vs Australia Live Updates, India Vs Australia Match Live Scores

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ-20 చివరి మ్యాచ్‌కు టిక్కెట్లు విక్రయిస్తున్న సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు గాయపడిన ఘటనపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ఈ ఘటనలో అభిమానులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగి పోలీసుల లాఠీచార్జికి దారితీయగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌తో పాటు ఉన్నతాధికారులను వివరణ కోసం పిలిపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం జింఖానా గ్రౌండ్‌లో చోటుచేసుకున్న ఘటన చాలా దురదృష్టకరమని, తొక్కిసలాటలో గాయపడిన వారికి హెచ్‌సిఎ తరపున వైద్య సహాయం అందిస్తున్నామని అజారుద్దీన్‌ తెలిపారు. టిక్కెట్ల అమ్మకాలపై దాచడానికి ఏమీ లేదని, దీనిపై మీడియాకు పూర్తి నివేదిక ఇస్తామని ఆయన అన్నారు. మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించే కాంట్రాక్టు పేటీఏం సంస్థకు అప్పగించామని, దీనిలో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చాలా రోజుల తరువాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం దక్కిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నామని అజారుద్దీన్ తెలిపారు.

ఇక మ్యాచ్ టికెట్లను బ్లాక్ చేశామని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని, మా దగ్గర కేవలం 3వేల కార్పోరేట్ టికెట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఒకసారి టికెట్ల బాధ్యత ఒక సంతకు ఇచ్చేశాక ఇక మళ్ళీ దానితో మాకు సంబంధం లేదని, ఎవరైనా బ్లాక్‌లో అమ్మితే పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. టిక్కెట్ల విక్రయం, లభ్యత మరియు ఇతర వివరాలపై నేను క్రీడాశాఖ మంత్రికి పూర్తి నివేదిక ఇస్తాను. ఏది సరైనది మరియు ఏది తప్పు అని ఆయనే మీకు చెబుతారని అన్నారు. మేం ఏ తప్పూ చేయలేదు, ఈ గదిలో కూర్చుని చర్చించుకున్నంత సులువుగా మ్యాచ్ నిర్వహించలేమని అజారుద్దీన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 13 =