ఒలింపిక్స్‌లో మళ్లీ చోటు దక్కించుకున్న క్రికెట్‌

Cricket is back in the Olympics,Cricket is back,back in the Olympics,Mango News,mango News Telugu,Cricket In Olympics News,Olympics Broadcast Rights,Olympic Athlete Rules,Brisbane Olympics Cricket, Cricket Vs Football Popularity In World,T20 World Cup 2024 Schedule, Cricket In Olympics,Cricket In Olympics 2028, Cricket In Olympics Benefits,From broadcasting rights,T20 World Cup 2024 Latest News,T20 World Cup 2024 Latest Updates,T20 World Cup 2024 Live News,Cricket In Olympics Latest Update
Cricket In Olympics News,Olympics Broadcast Rights,Olympic Athlete Rules,Brisbane Olympics Cricket, Cricket Vs Football Popularity In World,T20 World Cup 2024 Schedule, Cricket In Olympics,Cricket In Olympics 2028, Cricket In Olympics Benefits,From broadcasting rights

2028  లాస్ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో..  క్రికెట్ భాగం కానుంది. లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను ఐసీసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు తాజాగా ఆమోదించారు. దీనిపై మరోసారి  ముంబయిలో ఐఓసీ సదస్సులో ఓటింగ్ నిర్వహించగా.. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.

దీంతో ఇకపై ఒలింపిక్స్​‌లో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన క్రికెట్​ శాశ్వతంగా స్థానం సంపాదించుకుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్రికెట్​‌ను చేర్చడం వల్ల ఐఓసీకి లాభమేంటి అన్న చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏదయితేనేం.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పతకాల కోసం పోటీపడే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కిందని మరికొందరు అంటున్నారు.

నిజానికి 1900 ఒలింపిక్స్‌లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే చివరిసారి కూడా అయింది.  అప్పుడు బ్రిటన్ జట్టు అయిన డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌, ఫ్రాన్స్ జట్టు అయిన ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ క్రికెట్ మ్యాచ్‌లో  ఒక్క నేషనల్ ఆటగాడు కూడా లేడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో జట్టుకు కేవలం 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడటం వల్ల.. దీనికి అప్పట్లో  ఫస్ట్‌క్లాస్‌ హోదా కూడా దక్కలేదు.

సాధారణంగానే విశ్వ క్రీడా సంబరంగా భావించే ఒలింపిక్స్‌ అంటేనే అభిమానుల్లో అంచనాలు.. ఆసక్తి  ఓ రేంజ్‌లో ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఈవెంట్​లో లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించగా.. ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

నిజమే.. క్రికెట్‌ పేరు ఎత్తితే చాలు  ఉర్రూతలూగిపోతారు అభిమానులు. ముఖ్యంగా ఆసియా ఖండ దేశాలలో  క్రికెట్‌ అంటే ప్రాణాలే పెడతారు . అమెరికాతో పాటు ఐరోపా వంటి చాలా దేశాల్లో .. ఒకప్పుడు ఫుట్‌బాల్‌ను మాత్రమే చూసిన వారంతా ఇప్పుడు క్రికెట్‌ వైపు చూస్తున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఒలింపిక్స్​‌లో క్రికెట్​‌కు స్థానం కల్పించడం వల్ల.. వాణిజ్య పరంగా, క్రీడా పరంగా చాలా లాభాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్​ కంటే కూడా క్రికెట్​‌కు ఒలింపిక్సే అతి పెద్ద వేదికగా వర్ణిస్తున్నారు.

ఇప్పుడు ఒలింపిక్స్‌లో క్రికెట్​ చేర్చడం వల్ల ఫుట్​‌బాల్​‌కు సమానంగా ఇది​ క్రేజ్​ సంపాదించనుందని అభిమానులు పెద్ద ఎత్తున​ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే  నిపుణులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. క్రికెట్ అంటే క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ..ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌ను కూడా క్రాస్ చేసే క్రేజ్ క్రికెట్‌కు లేదని వాదిస్తున్నారు.

నిజానికి  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోని పురుషుల విభాగంలో కేవలం 87 దేశాలు ఉండగా.. మహిళల విభాగంలో 66 దేశాలు ఉన్నాయి. అదే  ఫిఫా ర్యాంకింగ్స్‌లోని పురుషుల విభాగంలో ఏకంగా  207 పురుషుల జట్లు, మహిళల విభాగంలో 186 దేశాలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే ఫుట్ బాల్ పై ఉన్న క్రేజ్ చెప్పకనే చెబుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ సారి జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్​‌ను ప్రవేశ పెట్టడం మంచిదేనని.. అయితే ఇకపై ఒలింపిక్స్‌లో క్రికెట్​ శాశ్వత స్థానం సంపాదించనట్లు కాదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వల్ల భారత్‌లో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ నుంచి భారీగా డబ్బు రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ భావించినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒలింపిక్స్‌ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్  వేలం ద్వారా రూ.158 కోట్ల వరకు ఐఓసీ గడిస్తోంది. అయితే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం వల్ల బ్రాడ్ కాస్టింగ్ రైట్స్  విలువ భారీగా పెరిగిపోనుందని..దాదాపు రూ.15 వేల కోట్లు కేవలం బ్రాడ్ కాస్టింగ్ రైట్స్  ద్వారానే ఐఓసీకి లభించనున్నాయని తెలుస్తోంది. ఈ లెక్కలనుపరిగణనలోకి తీసుకోవడం వల్లే..ఇప్పుడు క్రికెట్‌ను ఒలింపిక్స్‌ చేర్చిందని నిపుణులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =