ఫుడ్‌ చైన్‌లోకి కాలుష్యాన్ని మోసుకెళ్తోన్న స్పైడర్స్: అధ్యయనం

Spiders carrying pollution up the food chain study,Spiders carrying pollution,pollution up the food chain,food pollution study,Mango News,Mango News Telugu,Are spiders polluters, Spiders, food chain, study,Mercury is a harmful metal,Spider Webs as Pollution Indicators,Mercury,Are spiders polluters Latest News,Are spiders polluters Latest Updates,Are spiders polluters Live News
Are spiders polluters, Spiders, Spiders carrying pollution, food chain, study,Mercury is a harmful metal,Mercury

సాలె పురుగులు మన అందరికీ ఓ కీటకంగానే తెలుసు. ఇంట్లో దోమలు వంటి చిన్న చిన్న కీటకాలను చంపేస్తుందని కూడా తెలుసు.  అయితే ఇవి కాలుష్యవాహకాలుగా పనిచేస్తాయని.. వీటి వల్ల పర్యావరణానికి పెను ముప్పు అని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెరువులు, నదుల దగ్గరలో  నివసించే సాలెపురుగులు పాదరసం వంటి పదార్థంతో కూడిన మెర్క్యురీ కాలుష్యాన్ని నీటి నుంచి భూమికి, ఇతరుల వనరులలోకి బదిలీ చేస్తున్నాయని కొత్త అధ్యయనం తెలిపింది.

నిజానికి  పాదరసం అనేది హానికరమైన లోహం అన్న విషయం అందరికీ తెలిసిందే.  పారిశ్రామిక కాలుష్యం అయిన పాదరసం.. మనిషి చేసే వివిధ కార్యకలాపాల ద్వారా బయటకు వెలువడుతుంది. సాధారణంగా మురుగు కాల్వల ద్వారా ప్రవహించి జనావాసాలు లేని ప్రాంతాల్లోకి  ఈ వ్యర్థాలు వెళ్లాలి. కానీ మనిషుల నిర్లక్ష్యం వల్ల  కొన్నిసార్లు , వ్యవస్థీకృత లోపాల వల్ల మరి కొన్నిసార్లు  చిన్న చిన్న చెరువులు, నదులకు చేరి  అటు నుంచి ఇతర సహజ వనరుల్లోకి కూడా ప్రవేశిస్తుంటాయి.

ముఖ్యంగా చెరువులు, నదులు, భూ గర్భ జలాల్లో పాదరసం వంటి లోహాలు కలిసి పోయినప్పుడు ఆ నీళ్లను తాగడానికి, స్నానానికి వాడే మనుషులు, పశువులు  చాలా తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణ సమస్యలతో పాటు కిడ్నీ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంతగా భయంకరమైన రోగాలకు ఎందుకు గురవ్వాల్సి వస్తుందంటే.. పాదరసం నీటిలోకి ప్రవేశించిన తర్వాత దానిలో ఉండే బాక్టీరియా అత్యంత విషపూరిత రూపమైన మిథైల్మెర్క్యురీగా మారడం వల్ల అని పరిశోధనలో తేలింది.

ఎంతో హానికరమైన పాదరసం ఫుడ్ చైన్‌లోకి ప్రవేశించడం వల్లే..  రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు .. సుపీరియర్ లేక్ వద్ద ఉన్న రెండు ఉపనదుల సమీపంలో పొడవైన దవడలు కలిగిన సాలె పురుగులను అధ్యయనంలో  భాగంగా  వారు పరిశీలించారు. అంతేకాదు పాదరసం మూలాలను కొలవడానికి.. జలమార్గాలలో వివిధ అవక్షేపాలతో పాటు, డ్రాగన్‌ ఫ్లైస్ లార్వాను, ఎల్లో పెర్చ్ చేపల నమూనాలను కూడా పరిశీలకులు అబ్జర్వ్ చేశారు.

ఈ అధ్యయన సమయంలో  తూనీగలు, మిడతలు, జారోస్‌తో పాటు ఇతర జాతులకు చెందిన స్పైడర్స్.. నీటిలోని పాదరసం ఆనవాళ్లను, కాలుష్యాన్ని పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్లడంతో పాటు.. భూమిలోకి తీసుకెళ్లడంలోనూ వాహకాలుగా మారుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు వీటి ద్వారా నీటిలోకి చేరిన పాదరసంతో మనిషికి కూడా ప్రమాదం జరుగుతుందని గ్రహించారు. ఎలా అంటే.. పాదరసం ద్వారా కలుషితమైన నీటిలోనే ఉండే చేపలు, రొయ్యలు వంటివి  తినడం వల్ల మనుషుల ఆరోగ్యంపై ప్రభావం హానికరమైన ప్రభావం చూపిస్తుందని తేలింది.

కొంతమంది మనుషులు చేసిన నిర్లక్ష్యానికి మరికొంతమంది శిక్ష అనుభవిస్తున్నట్లు అవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే పాదరసం వంటి లోహాలను ప్రత్యేక మార్గాల ద్వారా మురుగునీటిలోకి వదలాలని కోరుతున్నారు. నీరు ప్రవహించే మార్గాలలోకి, ఆహార గొలుసులోకి  ఇలాంటి కాలుష్య కారకాలు చేరకుండా అడ్డుకోవాలని సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eighteen =