బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు బ్రిస్బేన్ గబ్బా వేదికగా సిద్ధమయ్యాయి. శనివారం ఉదయం 5.50 గంటలకు భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ప్రారంభమవుతుంది. సిరీస్ 1-1తో సమంగా కొనసాగుతుండటంతో ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది.
ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ సిరీస్‌ను గెలవాల్సిన అవసరం ఉంది. అయితే, గబ్బా టెస్టులో వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గబ్బాలో వర్షం :
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఐదు రోజులు వరుణుడి ప్రతాపం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి:
మొదటి రోజు: ఉదయం, మధ్యాహ్నం మోస్తారు వర్షాలు.
రెండో రోజు: ఉదయం, సాయంత్రం జల్లులు.
మూడో రోజు: ఉదయం వర్షం సూచనలు.
నాలుగో రోజు: చిన్నపాటి జల్లులు మాత్రమే.
ఐదో రోజు: మోస్తారు వర్షాలు.
అయితే భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఉండకపోవడం బ్యాటర్లకు కొంత ఊరటనిచ్చే అంశం.
గబ్బా పిచ్ రిపోర్ట్:
గబ్బా పిచ్ సంప్రదాయంగా పేసర్లకు అనుకూలమవుతుంది. ఈసారి కూడా పేస్, బౌన్స్ కలిగిన పిచ్‌ను సిద్ధం చేసినట్లు పిచ్ క్యురేట్ వెల్లడించాడు. వర్షం ప్రభావం కలిసిరావడంతో బ్యాటర్లకు ఈ పిచ్ మరింత సవాలుగా మారే అవకాశం ఉంది.
గబ్బాలో ఆస్ట్రేలియా రికార్డు:
క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా కేవలం 7 మ్యాచ్‌ల్లోనే ఓటమి చవిచూసింది.
క్రిస్మస్ తర్వాత ఆడిన 5 టెస్టుల్లో 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ముఖ్యంగా 2020-21 సిరీస్‌లో గబ్బాలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించి, 1988 తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు తొలి ఓటమిని అందించింది.
భారత జట్టు :
గత గబ్బా విజయం భారత్‌కు మానసికంగా మెరుగైన స్థితి ఇస్తుంది. అయితే వర్షం ప్రభావం, బౌన్సీ పిచ్ వంటి అంశాలు ఈ మ్యాచ్‌ను అత్యంత రసవత్తరంగా మార్చే అవకాశముంది.