ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల నిర్వహణ ఎక్కడంటే?

BCCI Announces Schedule and Venue Details for IPL-2022 Playoffs Final, BCCI Announces Schedule and Venue Details for IPL-2022 Playoffs, BCCI Announces Schedule and Venue Details for IPL-2022 Final, Schedule and Venue Details for IPL-2022 Playoffs And Final, IPL-2022 Playoffs And Final, IPL-2022 Playoffs Schedule and Venue, IPL-2022 Final Schedule and Venue, BCCI Announces Schedule and Venue Details for IPL-2022 Playoffs And Final, BCCI, Board of Control for Cricket in India, IPL-2022, 2022 IPL, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్‌ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్, వేదిక వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఐపీఎల్ ప్లేఆఫ్‌ మ్యాచులు మరియు ఫైనల్ మే 24 నుండి మే 29 వరకు కోల్‌కతా మరియు అహ్మదాబాద్‌లలో జరుగుతాయని బీసీసీఐ తెలిపింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న క్వాలిఫైయర్ 1, మే 25న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అలాగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 27న క్వాలిఫైయర్ 2 మరియు మే 29న ఫైనల్‌ మ్యాచులు జరగనున్నాయి. మరోవైపు మే 23 నుంచి మే 28 వరకు మహిళల టీ20 ఛాలెంజ్‌ ను పూణేలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్-2022 ప్లేఆఫ్‌ లు, ఫైనల్ షెడ్యూల్:

  • మే 24 – క్వాలిఫైయర్ 1 (టీమ్ 1 vs టీమ్ 2) – కోల్‌కతా
  • మే 25 – ఎలిమినేటర్ (టీమ్ 3 vs టీమ్ 4) – కోల్‌కతా
  • మే 27 – క్వాలిఫైయర్ 2 (విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్ vs లూజర్ ఆఫ్ క్వాలిఫైయర్ 1) – అహ్మదాబాద్‌
  • మే 29 – ఫైనల్ (విన్నర్ ఆఫ్ క్వాలిఫైయర్ 1 vs విన్నర్ ఆఫ్ క్వాలిఫైయర్ 2) – అహ్మదాబాద్‌

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =