సంజూ శాంసన్ (58) బ్యాటింగ్ లో ముఖేష్ కుమార్ (22కి 4) అత్యుత్తమ బౌలింగ్ తో జింబాబ్వేతో జరిగిన టీ20 క్రికెట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియన్ టీమ్ 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్నాడు. హర స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మొదటి 4 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. అయినప్పటికి సికందర్ రాజా చేజింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (13), యశస్వి జైస్వాల్ (12) వెంటనే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ (14) బ్యాట్‌తో రాణించలేదు. సంజు శాంసన్ రియాన్ పరాగ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 24 బంతుల్లో 22 పరుగులు చేశాడు. చెలరేగిన శివమ్ దూబే 12 బంతుల్లో 26 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు
అర్ధ సెంచరీతో చెలరేగిన సంజూ
ఓ వైపు వికెట్లు పడుతుండగా, క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్ 45 బంతుల్లో ఒక ఫోర్, 4 వరుస సిక్సర్లతో మెరిసాడు. జట్టు స్కోరును 160 మార్కును దాటించాడు. విలువైన 58 పరుగులు చేసిన సంజు 18వ ఓవర్‌లో వికెట్‌ను కోల్పోయాడు. జింబాబ్వే తరఫున బ్లెస్సింగ్ ముజారబానీ 19 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టుకు టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్ షాక్ ఇచ్చాడు. గత 2 మ్యాచ్‌ల్లో విశ్రాంతి తీసుకున్న ముఖేష్ కుమార్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ అధ్బుతంగా బౌలింగ్ చేశాడు. అతను వేసిన తొలి ఓవర్ మూడో బంతికి జింబాబ్వే ఓపెనర్ వెస్లూ మాధేవెరే (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్రియాన్ బెన్నెట్ (10) కూడా వారికి పెవిలియన్ దారి చూపించాడు. తర్వాత తన 2వ స్పెల్‌లో ఫరాజ్ అక్రమ్ (27), రిచర్డ్ నగరావా (0)లను అవుట్ చేసి తన T20I కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. టీమ్ ఇండియా బౌలింగ్ ధాటికి ధీటుగా జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా ఆతిథ్య జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో డియోన్ మైయర్స్ (34) అత్యధిక పరుగులు చేశాడు. భారత్ తరఫున శివమ్ దూబే 2 వికెట్లు తీయగా, తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీసి టీమ్ ఇండియా విజయంలో తలో చేయి వేశారు.
IND vs ZIM 5వ T20 మ్యాచ్ స్కోర్
టీం ఇండియా: 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 (అభిషేక్ శర్మ 14, సంజు శాంసన్ 58, ర్యాన్ పరాగ్ 22, శివమ్ దూబే 26; బ్లెస్సింగ్ ముజార్బానీ 2 వికెట్లకు 19).
జింబాబ్వే: 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ (తడివనాశే మారుమణి 27, డయాన్ మైయర్స్ 34, ఫరాజ్ అక్రమ్ 27; ముఖేష్ కుమార్ 22కి 4, శివమ్ దూబే 25కి 2).
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: శివమ్ దూబే
మ్యాన్ ఆఫ్ ద సిరీస్: వాషింగ్టన్ సుందర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY