ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో టోర్నమెంట్‌ను ప్రారంభించిన భారత్, ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఎదుర్కొనుంది. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును విజయానికి నడిపించాడు. అయితే, పాకిస్థాన్ బలమైన జట్టుగా ఉండటంతో, కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని మార్పులను చేపట్టే అవకాశముంది.
ఓపెనింగ్ జోడిలో మార్పులు ఉండే సూచనలు లేవు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు బంగ్లాదేశ్‌తో మంచి భాగస్వామ్యాన్ని అందించడంతో వారిద్దరూ ఓపెనర్లుగా కొనసాగుతారు. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ నంబర్ 3 స్థానం లో ఉంటాడు. కోహ్లీ ప్రత్యేకంగా నెట్స్‌లో ఎక్కువ సమయం కేటాయించి, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌పై సాధన చేస్తున్నాడు. అతని ఫామ్ ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ వరుసగా నంబర్ 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.
ఆల్-రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఉండగా, వారు జట్టుకు సమతుల్యతను అందించనున్నారు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ మార్పు జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌పై కుల్దీప్ యాదవ్ ఆడినా, పాకిస్థాన్‌తో మ్యాచ్ కు వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, హర్షిత్ రాణా కొనసాగుతారు. అర్ష్‌దీప్ సింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోవచ్చు. మొత్తం మీద, రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు బలమైన కూర్పుతో పాక్‌ను ఎదుర్కొనుంది.
పాకిస్థాన్ తో ఆడే అవకాశం ఉన్న భారత ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.