బంగ్లాతో మొదటి టెస్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా పుజారా, రోహిత్, షమీ, జడేజా దూరం

India Vs Bangladesh 1St Test Kl Rahul As Captain And Cheteshwar Pujara As Vice Captain,Kl Rahul As Captain, Pujara As Vice-Captain, Rohit As Vice-Captain, Shami As Vice-Captain, Jadeja As Vice-Captain,First Test Against Bangladesh,Mango News ,Mango News Telugu,India Vs Bangladesh,Ind Vs Bangladesh,Ind Vs Bng,India Vs Bangladesh Test Series,Indian Cricket Team,Bangladesh Cricket Team,India,Bangladesh,Bangladesh Vs India, India In Bangladesh,India Test Series,Bangladesh Test Series,Ind Vs Bng Test Series,

భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగియగా, డిసెంబర్ 14-18, 22-26 తేదీల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. కాగా బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే భారత్ జట్టును ఎంపిక చేయగా, తాజాగా భారత్ టెస్ట్ జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పులపై బీసీసీఐ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ తో మొదటి టెస్ట్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా చటేశ్వర్ పుజారా వ్యవహరించనున్నారు.

“బంగ్లాదేశ్‌తో జరిగిన 2వ వన్డేలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఎడమ బొటన వేలికి గాయం కావడంతో ముంబయిలో స్పెషలిస్ట్‌ వైద్యుడిని కలిశాడు. ఈ గాయానికి తగిన నిర్వహణకు కోసం అతనికి సలహా ఇవ్వబడడంతో, బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండడు. బీసీసీఐ మెడికల్ టీమ్ తరువాత దశలో అతను రెండవ మరియు చివరి టెస్ట్‌కు అందుబాటులో ఉండే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను మొదటి టెస్టుకు ఎంపిక చేసింది” అని బీసీసీఐ పేర్కొంది.

ఇక ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భుజం గాయం నుంచి మరియు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయాల నుండి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారని తెలిపారు. షమీ, జడేజా స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారని, అలాగే ఈ టెస్టు సిరీస్‌కి భారత్ జట్టులో ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ను కూడా సెలక్షన్ కమిటీ చేర్చిందని బీసీసీఐ తెలిపింది.

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, చటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ వేదికల వివరాలు:

  • మొదటి టెస్టు – డిసెంబర్ 14-18 : జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చటోగ్రామ్
  • రెండో టెస్టు – డిసెంబర్ 22-26 : షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 5 =