ఐపీఎల్ 2025 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఊహించని మలుపులు తీసుకుంటూ క్రికెట్ అభిమానులను ఉత్కంఠలో ముంచేస్తోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచిన జట్లు రెండో మ్యాచ్‌లో వెనుకబడి పోతుండగా, ఆర్సీబీ మాత్రం తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఘోర పరాజయాలను ఎదుర్కొంటూ అట్టడుగున ఉంది.
దూసుకుపోతోన్న ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ఆర్సీబీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. కోల్‌కతాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందగా, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మెమరబుల్ విక్టరీ అందుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి 2.26 నెట్ రన్‌రేట్ నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గ్రాండ్ విక్టరీ అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నో 0.93 రన్‌రేట్‌తో ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచి 0.550 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఒక మ్యాచ్ ఆడి అందులో గెలిచింది. 0.371 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో ఓడింది. దాంతో -0.128 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఆరో స్థానానికి వచ్చింది. ఆర్సీబీపై ఘోర పరాజయం పాలయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. -1.013 పాయింట్లతో కోల్‌కతా తర్వాత స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లలో ఓడి ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.
ప్రతి ఏడాది పాయింట్ల పట్టికలో టాప్‌లో కనిపించే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ సీజన్‌లో అట్టడుగున పడి ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి ఆర్ ఆర్ పదో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై, రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిపాలయింది.