మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి, నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు

India vs England, Mango News, Motera Cricket Stadium, Motera Narendra Modi Cricket Stadium, Motera Renamed As Narendra Modi Stadium, Motera Stadium, Motera stadium renamed Narendra Modi Stadium, Narendra Modi, Narendra Modi Stadium, President Kovind, President Kovind Inaugurates Motera Stadium, President Kovind inaugurates Narendra Modi Stadium, President Ram Nath Kovind, President Ram Nath Kovind Inaugurates Motera Cricket Stadium, Refurbished Motera stadium renamed after PM

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా మొతేరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చినట్టు ప్రకటించారు. ముందుగా 2015 అక్టోబర్‌ నుంచి ఈ స్టేడియంలో పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి 2020 ఫిబ్రవరికి పూర్తిచేశారు. మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టేడియం 1 లక్షా 10 వేలు సీటింగ్ సామర్ధ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది.

6 ఇండోర్, 3 అవుట్‌డోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లుతో పాటుగా జిమ్‌ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్‌ రూమ్‌లు, 76 కార్పొరేట్‌ బాక్స్‌లు, 3000 కార్లు, 10000 ద్విచక్ర వాహనాలకు సరిపడా పార్కింగ్ స్పేస్, ప్రత్యేక ఆకర్షణతో కూడిన ఎల్‌ఈడీ లైట్‌లు ఇలా ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో రూ.800 కోట్లతో ఈ స్టేడియాన్ని పునరుద్దరించారు. ఈ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ గా నేడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడోదైనా డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు జరగబోతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 19 =