అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పేరుతో మార్మోగింది. తాజాగా ఈ స్టేడియంలో ఘనంగా జరిగిన ‘కోల్డ్ ప్లే’ కన్‌సర్ట్‌లో బుమ్రా పాల్గొని సందడి చేశాడు. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో బుమ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు క్రిస్ మార్టిన్ బుమ్రా గురించి ప్రత్యేక గీతం ఆలపించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. “జస్ప్రిత్, మై బ్యూటిఫుల్ బ్రదర్… ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వుయ్ డూ నాట్ ఎంజాయ్ యూ డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్” అంటూ క్రిస్ మార్టిన్ పాడిన పాటకు ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్పందించారు. బుమ్రా కూడా ఆ పాటను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా కనిపించాడు.
కన్సర్ట్‌కు బ్లాక్ కలర్ షర్ట్‌లో హాజరైన బుమ్రా, ప్రేక్షకుల మధ్య నిలబడి కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. ఈ కార్యక్రమంలో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో బుమ్రా చేసిన అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో కూడా ప్రదర్శించారు. ఆ వీడియో సమయంలో స్టేడియం ప్రేక్షకుల కేరింతలతో మార్మోగిపోయింది.
ప్రస్తుతం ఈ కన్సర్ట్‌లో బుమ్రా సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ‘కోల్డ్ ప్లే’ కన్‌సర్ట్ 21వ శతాబ్దంలో ఆసియాలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన మెజికల్ ఈవెంట్‌గా నిలిచింది. దాదాపు 1,34,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తోంది.
ఇదే తరహా వీడియోలు ఇతర సందర్భాల్లో కూడా ప్రదర్శితమయ్యాయి. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మరో కన్‌సర్ట్‌లో 2024లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను బుమ్రా యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేసిన క్లిప్ ప్రదర్శించగా, అప్పుడు కూడా ప్రేక్షకుల నుండి ఇదే స్థాయి స్పందన వచ్చింది.
COLDPLAY HONOURING JASPRIT BUMRAH AT THE NARENDRA MODI STADIUM. 🇮🇳
– Bumrah, the GOAT. 🐐pic.twitter.com/H4Oy9rNXal
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2025