బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మూడో టెస్టులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం

Border–Gavaskar Trophy Australia beat India by 9 wickets in 3rd Test,Border–Gavaskar Trophy,Australia beat India by 9 wickets in 3rd Test,Australia beat India,Mango News,Mango News Telugu,Border Gavaskar Trophy Streaming,Border Gavaskar Trophy 2023 Venue,Border-Gavaskar Trophy 2023,Border-Gavaskar Trophy Series,Border-Gavaskar Trophy History,Border-Gavaskar Trophy Squad,Border-Gavaskar Trophy Winners List,Border-Gavaskar Trophy Schedule,Border Gavaskar Trophy,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy Winners List,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy Documentary,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy 2021 Scorecard,Next Border Gavaskar Trophy,2023 Border Gavaskar Trophy,Ind Vs Aus Border Gavaskar Trophy 2023,2023 Border Gavaskar Trophy,Most Runs In Border Gavaskar Trophy

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్‌ ప్రస్తుతానికి 2-1 తో ఉంది. ఈ టెస్టులో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 163కే ఆలౌట్‌ అవ్వడంతో, ఆస్ట్రేలియా జట్టు ముందు స్వల్ప 76 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. మొదటి రెండు టెస్టులను స్పిన్ మాయాజాలం, బ్యాటింగ్ ప్రతిభతో మూడు రోజుల్లోనే ముగించి ఘన విజయాలు సాధించిన భారత్ జట్టుకు మూడో టెస్టులో పరాజయంతో షాక్ తగిలింది. కాగా ఈ టెస్టులో విజయంతో జూన్ 7 నుండి 11 వరకు లండన్‌ లోని ఓవల్‌ స్టేడియంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)-2023 ఫైనల్ కు ఆస్ట్రేలియా జట్టు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్ జట్టు విజయం సాధిస్తేనే డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు భారత్ జట్టు అర్హత సాధించనుంది.

76 పరుగుల లక్ష్యంతో వద్ద మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్టేలియా జట్టు 18.5 ఓవర్ల లోనే 78 పరుగుల చేసి విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అశ్విన్ బౌలింగ్ లో ఖవాజా డకౌట్ గా వెనుదిరగడంతో భారత్ గెలుపుపై ఆశలు రేకెత్తగా, ట్రావిస్ హెడ్ (49*), మార్కస్ లాబుషనే (28*) పరుగులతో రాణించి ఆస్ట్రేలియాకు గొప్ప విజయాన్ని చేకూర్చారు. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ టెస్టులో ఆస్ట్రేలియాకు స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహించాడు. భారత్ స్వదేశంలో ఆడిన చివరి 46 టెస్టుల్లో కేవలం మూడో టెస్ట్ మ్యాచ్‌ లలోనే ఓడిపోగా, గత పదేళ్లలో స్వదేశంలో టెస్టుల్లో భారత్‌ ను రెండుసార్లు ఓడించిన ఏకైక కెప్టెన్ గా స్టీవెన్ స్మిత్ నిలిచాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో 11 వికెట్స్ తీసిన నాథన్ లియోన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య 4వ టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

భారత్–ఆస్ట్రేలియా మూడో టెస్టు వివరాలు:

భారత్ తోలి ఇన్నింగ్స్: 109-10

  • విరాట్ కోహ్లీ (22), శుభ్ మన్ గిల్ (21)
  • ఎం కుఛ్నెమన్ 5/16, నాథన్ లియోన్ 3/35

ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్: 197-10

  • ఖవాజా (60), మార్కస్ లాబుషనే (31)
  • రవీంద్ర జడేజా 4/78, అశ్విన్ 3/44, ఉమేష్ యాదవ్ 3/12

భారత్ రెండవ ఇన్నింగ్స్: 163-10

  • పుజారా (59), శ్రేయాస్ అయ్యర్ (26)
  • నాథన్ లియోన్ 8/64

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్: 78-1

  • ట్రావిస్ హెడ్ (49*), మార్కస్ లాబుషనే (28*)
  • అశ్విన్ 1/44.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =