ఫారిస్ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో రజత పతకం సాధించాడు. కానీ రజత పతకాన్ని తెచ్చి దేశ ప్రతిష్టను మరింత పెంచాడు నీరజ్ చోప్రా. పాకిస్థాన్‌కు చెందిన అషర్ద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా ఫైనల్లో రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు విసిరి రజత పతకాన్ని సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో అర్షద్ రెండో ప్రయత్నంలో 92.97 విసిరి చరిత్ర సృష్టించాడు. నదీమ్ త్రో ఒలింపిక్ రికార్డుగా మారింది.
కోట్లాది మంది భారత క్రీడాభిమానుల కల నిద్రను చెదరగొట్టిన పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జావెలిన్ క్రీడలో భారత స్టార్ నీరజ్ చోప్రా అంతర్జాతీయ స్థాయిలో సందడి చేయడం ప్రారంభించినప్పటి నుండి, అర్షద్ నదీమ్ అతనికి గట్టి పోటీ ఇస్తూ ఇచ్చాడు. అతను అనేక పోటీలలో నీరజ్ చోప్రాతో పోడియంను కూడా పంచుకున్నాడు. కానీ, ఇంతకు ముందు ఎప్పుడూ నీరజ్‌పై పైచేయి సాధించ లేదు. కాని ఇప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో మిరాకిల్ చేశాడు అర్షద్ నదీమ్. 92.97 మీటర్ల కొత్త ఒలింపిక్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు. నీరజ్‌పై స్వర్ణం సాధించాడు. అర్షద్ నదీమ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ డెలివరీ. అలాగే 90 మీ. భర్జీ ఎక్కువ దూరం విసరడం కూడా ఇదే తొలిసారి. నీరజ్ చోప్రా 89.45 మీ. లాంగ్ జావెలిన్ త్రోలో రజతం సాధించాడు.
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని మియాన్ చానులో నిరుపేద పంజాబీ కుటుంబంలో జన్మించిన అర్షద్ నదీమ్ తన పాఠశాల రోజుల నుండి వివిధ క్రీడలలో పాల్గొన్నాడు. మొదట్లో క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ మరియు అథ్లెటిక్స్‌లో పాల్గొన్న నదీమ్ 7వ తరగతి చదువుతున్నప్పుడు అథ్లెటిక్స్ కోచ్ రషీద్ అహ్మద్ సాకీ దృష్టిలో పడ్డాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న యువ క్రీడాకారులను గుర్తించడంలో ఆసక్తి కనబరిచిన సాకీ ద్వారా అర్షద్‌కు ప్రారంభంలోనే మార్గదర్శకత్వం లభించింది. జావెలిన్ త్రో కళలో ప్రావీణ్యం సంపాదించడానికి ముందు, అర్షద్ డిస్కస్ త్రో మరియు షాట్‌పుట్‌లో కూడా సత్తా చాటాడు. తరువాత, పంజాబ్ యూత్ ఫెస్టివల్ జావెలిన్ పోటీలో స్వర్ణం గెలిచిన తరువాత, అతని కెరీర్ త్రోయింగ్‌లో ప్రారంభమైంది. అతని తండ్రి ముహమ్మద్ అష్రాఫ్ సలహా మేరకు, అర్షద్ జావెలిన్ త్రో క్రీడలో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.