నీరజ్ చోప్రాకు ‘గోల్డెన్’ ఛాన్స్..

పసిడి దిశగా దూసుకెళ్తున్న హాకీ వీరులు అనూహ్యంగా సెమీస్లో నిష్క్రమించి కాంస్యం కోసం పోరాడనున్నారు. రెజ్లింగ్ ఫైనల్లో అడుగు పెట్టి కనీసం రజతం ఖాయం చేసుకున్న వినేశ్ పొగట్ అనూహ్య రీతిలో అనర్హత వేటు పడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. గంటల వ్యవధిలో తగిలిన ఈ రెండు దెబ్బలతో భారత అభిమానులు షాక్లో ఉన్నారు . ఈ బాధ నుంచి ఉపశమనాన్ని ఇస్తాడని భారతీయులంతా నీరజ్ చోప్రా వైపు ఆశగా చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జావెలిన్‌ త్రోయర్‌లో నంబర్‌ 1గా నిలిచిన భారత ఆటగాడు నీరజ్‌ చోప్రా.. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఒలింపిక్ అరేనాలో వరుసగా బంగారు పతకాలు సాధించి అపూర్వమైన విజయాన్ని సాధించే దిశగా అడుగు వేశాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 89.34మీ.తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్. లాంగ్‌షాట్‌ విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు.

ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు మాత్రమే సాధించింది. ఈ మూడు కూడా షూటింగ్ ఈవెంట్‌లోనే పతకాలు వచ్చాయి. 25 మీ. మను భాకర్ వ్యక్తిగత మరియు మిక్స్‌డ్ విభాగాల్లో 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. స్వప్నిల్ కుసాలే 50మీ. రైఫిల్ షూటింగ్‌లో మరో కాంస్యం సాధించాడు. వ్యక్తిగత కాంస్యంతో పాటు సబర్జోత్ సింగ్‌తో కలిసి మనుభాకర్ కాంస్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆగస్టు 8న అంటే ఈ రోజు ఒలింపిక్స్ జావెలిన్ త్రో పోటీ ఫైనల్ జరుగుతుంది. దీంతో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొట్టాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాకు మద్దతుగా రిషబ్ పంత్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఫైనల్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే, అభిమానుల్లో ఒకరికి 100,089 రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రిషబ్ పంత్ తన సోషల్ మీడియా పోస్ట్‌ను లైక్ మరియు కామెంట్ చేసిన లక్కి ఫ్యాన్ కి రూ. 100,089 బహుమతిగా ఇస్తానని మరియు 10 మందిని ఎంపిక చేసి వారికి ఫ్రాన్స్‌కు విమాన టిక్కెట్లను కూడా ఇస్తానని ప్రకటించాడు. నీరజ్ చోప్రాకు మద్దతు ఇద్దాం” అని రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యి ఉండవచ్చని కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.