ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్-2025 కు భారత్‌ ఆతిథ్యం, ఐసీసీ కమిటీలోకి వీవీఎస్ లక్ష్మణ్

India to Host ICC Women's Cricket World Cup 2025 VVS Laxman Appointed to ICC Men’s Cricket Committee, VVS Laxman Appointed to ICC Men’s Cricket Committee, India to Host ICC Women's Cricket World Cup 2025, ICC Men’s Cricket Committee, VVS Laxman Along With Daniel Vettori Appointed To ICC Men's Cricket Committee, India to Host 2025 ICC Women's Cricket World Cup, ICC Women's Cricket World Cup 2025, 2025 ICC Women's Cricket World Cup, ICC Women's Cricket World Cup, Next ICC Women's Cricket World Cup in 2025 will be hosted by India, VVS Laxman News, VVS Laxman Latest News, VVS Laxman Latest Updates, VVS Laxman Live Updates, Mango News, Mango News Telugu,

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సదస్సులో 2024-2027 మధ్య జరిగే ప్రతి ప్రధాన ఐసీసీ మహిళల టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు నిర్ధారించబడ్డాయి. నాలుగేళ్లలో మొత్తం నాలుగు మహిళల టోర్నీలు జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇందులో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్-2025 కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు తలపడనుండగా, మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇది భారత్ ఆతిధ్యమివ్వబోయే ఐదవ ఐసీసీ మహిళల టోర్నమెంట్‌ కాగా, అందులో నాలుగు ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ టోర్నమెంట్స్ ఉన్నాయి.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్-2024కు బంగ్లాదేశ్, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్-2026కు ఇంగ్లాండ్, ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. మరోవైపు 2023 నుండి 2027 వరకు పురుషుల మరియు మహిళల ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ రెండూ కూడా ఐసీసీ బోర్డుచే ఆమోదించబడ్డాయని, రానున్న రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుందని తెలిపారు.

ఐసీసీ కమిటీలోకి వీవీఎస్ లక్ష్మణ్:

అలాగే తదుపరి ఐసీసీ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు నవంబర్ 2022లో జరుగనున్నాయి. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్క్లే ఉండగా, కొత్త చైర్మన్ పదవీకాలం డిసెంబర్ 1 2022 నుండి 30 నవంబర్ 2024 వరకు రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఇక భారత్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెట్టోరి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి ప్రస్తుత ప్లేయర్ ప్రతినిధులుగా నియమితులయ్యారు. రోజర్ హార్పర్ శ్రీలంకకు చెందిన మహేల జయవర్దనతో కలిసి రెండవ గత ప్లేయర్ ప్రతినిధిగా నియమితులయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =