విరాట్ కోహ్లీ అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి నెటింట చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే మరోసారి పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
తాజాగా ఇలాంటి మార్పే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనూ చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి కేప్టెన్సీ అవతారం ఎత్తాడు. తన సొంత టీమ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పగ్గాలను అందుకోనున్నాడు. ఆర్సీబీ కేప్టెన్‌గా కోహ్లీకి పట్టాభిషేకం చేయడం దాదాపుగా ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 17 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గత సీజన్ తొలి అర్ధభాగంలో పేలవమైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. కోచ్ ఆండీ ప్లోవర్‌ని తీసుకురావడంతో ఈసారి ఆర్సీబీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త కెప్టెన్‌ని తీసుకురాకుండా, విరాట్ కోహ్లీనే మరోసారి కెప్టెన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రిటెన్షన్ లిస్ట్ చర్చల సమయంలో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్సీకి వచ్చేలా ఒప్పించినట్లు ఆర్సీబీ టీమ్ ఓనర్లు చెబుతున్నారు. కానీ, మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుందనే మరో వాదన కూడా వినిపిస్తుంది. 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా పనిచేసిన విరాట్ కోహ్లీ 140 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా, 66 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
గడిచిన మూడు సీజన్‌లుగా ఫాఫ్ డుప్లిసిస్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు 40 ఏళ్లు. దీంతో అతడిని రిటైన్ చేసుకోవడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి ఆడుతున్నప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దీంతో ఈసారి మెగా వేలంలో పక్కా ప్లాన్‌లను అమలు చేసి.. టైటిల్ అందించే ఆటగాళ్లతో జట్టును బలంగా చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్‌ను వదిలేయాలని ఆర్సీబీ డిసైడ్ అయినట్లు సమాచారం. చూడాలి మరి విరాట్ కోహ్లీ నిజంగానే మరోసారి జట్టు పగ్గాలు అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేి.