ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ప్రకటన, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చోటు

ICC Reveals Men's T20 Team of the Year 2022 Kohli Suryakumar Yadav Hardik Pandya Gets Place,ICC T20 Team Of The Year-2022, Kohli, Suryakumar Yadav, Hardik Pandya,Mango News,Mango News Telugu,T20 Team Of The Year 2022,Icc Womens T20 Team Of The Year 2022,Icc Team Of The Year 2022,Icc Mens T20 Team Of The Year 2022,Icc Odi Team Of The Year 2022,Icc Test Team Of The Year,Icc T20 Team Of The Decade,Icc Mens T20 Player Of The Year 2022,Icc Womens T20 Team Of The Year 2022,Icc Mens T20 Team Of The Year 2022,Icc T20 Team Of The Year 2019,Icc T20 Womens Team Of The Year,Icc T20 Womens Team Of The Year 2022,Icc Top 10 T20 Teams,Icc Best T20 Team,Icc Ranking T20 Team 2021,Icc Mens T20 Team Of The Year,Icc Womens T20 Team Of The Year

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను ప్రకటించింది. 2022 క్యాలెండర్ ఇయర్‌ లో బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఆల్ రౌండర్ విభాగాల్లో రాణించి, అందరినీ ఆకట్టుకున్న 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లతో ఐసీసీ టీ20 టీమ్ ను ప్రకటించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 లో భారత్ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగం కింద స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కగా, ఆల్ రౌండర్ విభాగం కింద హార్థిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 కు కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ను ఐసీసీ ప్రకటించింది. ఇక మహిళల క్రికెట్‌ కు సంబంధించి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ చోటు దక్కించుకున్నారు.

మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్‌ రిజ్వాన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్‌, సికిందర్‌ రజా, హార్థిక్ పాండ్యా, సామ్ కరన్, వానిందు హసరంగ, హారిస్ రవూఫ్‌, జోష్‌ లిటిల్.

ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022: స్మృతి మంధాన, బెత్ మూనీ, సోఫీ డివైన్ (కెప్టెన్‌), యాష్ గార్డనర్, తహిలా మెక్‌గ్రాత్, నిదా దార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్) సోఫీ ఎక్లెస్టోన్, ఇనోకా రణవీర, రేణుకా సింగ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 2 =