రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డ విషయం ఆందోళన కలిగించగా, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీకి తగిలిన వేలి గాయం పెద్దది కాదని, అతను త్వరలోనే ఫుల్ ఫిట్‌నెస్‌తో మళ్లీ బరిలోకి దిగనున్నాడని స్పష్టం చేశాడు.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టన్ (40 బంతుల్లో 54, 1 ఫోర్, 5 సిక్సర్లు) అర్థ శతకంతో రాణించాడు. అయితే, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు కీలక వికెట్లు తీసి గుజరాత్ విజయానికి దోహదపడ్డాడు. అనంతరం గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయాన్ని అందించాడు.
ఐపీఎల్‌లో సిరాజ్‌కి గుర్తింపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద్వారానే లభించింది. అయితే, గతేడాది వేలంలో ఆర్సీబీ అతనిని రిటైన్ చేయకపోవడంతో గుజరాత్ టైటాన్స్ అతడిని కొనుగోలు చేసింది. బెంగళూరు పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ మూడు వికెట్లు తీసి తన విలువను మరోసారి రుజువు చేసుకున్నాడు. దీనిపై స్పందించిన ఆర్సీబీ కోచ్ ఫ్లవర్, “సిరాజ్‌ను రిటైన్ చేయకపోవడంపై బాధ లేదు. మా ప్రస్తుత బౌలింగ్ లైనప్‌తో సంతృప్తిగా ఉన్నాం,” అని వ్యాఖ్యానించాడు.
పవర్‌ప్లేలోనే ఆర్సీబీ తడబాటు
తక్కువ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయాలనే ఆలోచనతో ఆర్సీబీ పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు, గుజరాత్ నెమ్మదిగా ఆడి, వికెట్లు కాపాడుకొని చివర్లో విజృంభించి విజయాన్ని అందుకుంది. తాజా ఫలితంతో ఆర్సీబీ టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది, గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది.
ఇక నెక్స్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కోనుంది. గత సీజన్‌లో కేకేఆర్ చేతిలో మూడుసార్లు ఓడిన సన్‌రైజర్స్, ఈసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
Virat Kohli has hurt his fingers. pic.twitter.com/k4TjsFVegm
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2025