ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్: తొలిరోజు భారత్ 233/6, విరాట్ కోహ్లీ 74 అవుట్

India vs Australia 1st Test: India 233/6 at Stumps on Day 1,India vs Australia 1st Test Day 1 Highlights,India vs Australia 1st Test Highlights 2020,India vs Australia Highlights 1st Test Match,India vs Australia Day 1 Highlights,India vs Australia Highlights Day 1 Test Match,India vs Australia 1st Test 2020,India vs Australia 1st Test Score,India vs Australia 1st Test 2020 Live Score,Highlights India vs Australia Match,Ind vs Aus 1st Test Highlights,Aus vs Ind Vs 1st Test Highlights,India vs Australia Live,Virat Kohli,Mango News,Mango News Telugu,Ind vs Aus 1st Test,Australia Restrict India To 233/6 At Stumps On Day 1,Kohli,India 233/6 at Stumps on Day 1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్ట్ గురువారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి తోలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. తోలి రోజు భారత జట్టుపై ఆస్ట్రేలియా బౌలర్లు ఆధిపత్యం చూపించారు. ఓపెనర్లు పృథ్వీషా(0), మయాంక్ అగర్వాల్(17) తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో చటేశ్వర్ పుజారా(43), కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(74) పరుగులతో జట్టును ఆదుకున్నారు.

ముఖ్యంగా కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ తన బ్యాటింగ్ తో అలరించాడు. పుజారా అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె (44) తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే రహానే అనవసర పరుగుకు ప్రయత్నించడంతో శతకం దిశగా వెళ్తున్న‌ కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. ఇక హనుమ విహారి కూడా 16 పరుగులకే వెనుతిరిగాడు. ఆటముగిసే సమయానికి‌ రవిచంద్రన్‌ అశ్విన్ ‌(15), వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా (9) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హాజల్ వుడ్, కమ్మిన్స్, నాథన్ లియోన్ ఒక్కో వికెట్ తీశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fourteen =