2027 ఐసిసి వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడే అవకాశం ఉందని టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల విలేకరుల సమావేశంలో పెద్ద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను కాపాడుకోవాలని గంభీర్ హితవుపలికాడు. 2024 ICC T20 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్లో టీమ్ ఇండియా ట్రోఫీని గెలుచుకున్న తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ, 36 ఏళ్ల విరాట్ కోహ్లీ తమ అంతర్జాతీయ T20 క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. దీంతో వీరిద్దరు 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడటం దాదాపు అనుమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పటికి విరాట్ కోహ్లీ కి 39 ఏళ్లు, రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి. దీంతో వారిద్దరూ ఇప్పటివరకు ఆడటం అనుమానమే అని అందరూ అనుకుంటున్నారు
ఇక ఈ విషయమై టీమిండియా క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ రోహిత్ పై సెటైర్ కూడా వేశాడు. ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ, 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పాల్గొనడంపై జోక్ చేశాడు. విరాట్ కోహ్లీ తదుపరి వన్డే ప్రపంచకప్ ఆడిన.. రోహిత్ ఆడటం కష్టమేనని భారత జట్టు మాజీ చీఫ్ సెలక్టర్ కూడా అయిన క్రిస్ శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడగలడు, కానీ రోహిత్ శర్మ ఆఫ్రికా లో స్పృహతప్పి పడిపోతాడని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పాడు.
2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో విరాట్ కోహ్లీ సభ్యులు. ఇప్పుడు రోహిత్ శర్మ 2007 మరియు 2024 T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న భారత జట్టులో ఉన్నాడు. ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్న అతడు వన్డే ప్రపంచకప్ సాధించిన ఘనత తో రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీని గెలిస్తే.. ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కుతుంది. ఇక్కడ ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా ముఖ్యం. అందుకే ఈ వెటరన్ బ్యాట్స్మెన్లు 2025లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఐసిసి టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంపై దృష్టి పెట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF