భారత్ కు మరో పతకం ఖరారు, సంచలన విజయంతో ఫైనల్ కు భారత రెజ్లర్ రవి దహియా

Indian wrestler Ravi Kumar Dahiya enters Olympics Final, Indian Wrestler Ravi Kumar Dahiya Enters to Final, Indian Wrestler Ravi Kumar Dahiya Enters to Final Assures silver for India, Mango News, Ravi Kumar Dahiya enters 57kg wrestling final, Tokyo 2020, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2020 Live, Tokyo Olympics 2020 LIVE Updates, Tokyo Olympics News, Tokyo Olympics Wrestling, Wrestler Ravi Kumar Dahiya, Wrestler Ravi Kumar Dahiya enters final

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖరారైంది. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవికుమార్‌ దహియా సంచలన విజయంతో ఫైనల్ కు దూసుకెళ్లాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ సుశీల్ కుమార్ ఫైనల్ కు చేరగా, 9 సంవత్సరాల అనంతరం ఒలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించిన రెండో భారత రెజ్లర్ గా రవికుమార్ దహియా నిలిచాడు. దీంతో భారత్ కు కనీసం రజత పతాకాన్ని ఖరారు చేశాడు. బుధవారం మధ్యాహ్నం రవికుమార్‌ దహియా, కజకిస్తాన్ రెజ్లర్, 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ మెడలిస్ట్ అయిన నూరిస్లామ్ సయనేవ్ మధ్య జరిగిన సెమీఫైనల్ ఆసాంతం హోరాహోరీగా సాగింది.

ఈ పోటీలో మొదటి పీరియడ్‌లో రవికుమార్‌ దహియా 2-1 తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ, రెండవ పీరియడ్‌లో నూరిస్లామ్ ఆధిపత్యం చెలాయించి 9-2 తో ముందంజలో నిలిచాడు. అనంతరం దూకుడుగా ఆడిన రవి 5 పాయింట్లు సాధించడంతో 7-9 కి చేరాడు. తర్వాత నూరిస్లామ్ గాయపడడం, చివరిలో 30 సెకన్ల సమయంపాటుగా నూరిస్లామ్ లేవకుండా రవి కట్టడి చేయడంతో నూరిస్లామ్ 9-7తో ఉన్నప్పటికీ, రవి పిన్‌ఫాల్ ద్వారా మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్ కు చేరుకున్నాడు. ఇక గురువారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ లో బంగారు పతకం కోసం రష్యా ఒలింపిక్ కమిటీకి (ఆర్ఓసీ) చెందిన జావుర్ ఉగ్దేవ్ తో రవికుమార్‌ దహియా తలపడనున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here