మ్యాచ్‌లో మూడో రోజు రెండో సెషన్‌లో కివీస్‌ను 402 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించి ధీటైన పోరాటం చేసింది. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ బ్యాటింగ్ విభాగం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్టు అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ రెండో రోజు న్యూజిలాండ్ పట్టు సాధిస్తే.. మూడో రోజు టీమ్ ఇండియా అందుకు ధీటుగా సమాధనం ఇస్తోంది. మూడో రోజు రెండో సెషన్‌లో కివీస్‌ను 402 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ధీటుగా పోరాడుతోంది. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ బ్యాటింగ్ విభాగం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. దీంతో ఇన్నింగ్స్ లోటు 125 పరుగులకు తగ్గింది. టీమిండియా తరఫున రోహిత్, కోహ్లీ, సర్ఫరాజ్ ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించారు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసింది. రోహిత్, యశవ్సీ మధ్య తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 52 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు జైస్వాల్.. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరి తర్వాత క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కోహ్లి 102 బంతుల్లో 70 పరుగులు చేసి మూడవ రోజు ఆట ముగిసే సమయానికి పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ 78 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి నాలుగో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించననున్నాడు.
కోహ్లీ 9000 పరుగులు పూర్తి
రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఈ హాఫ్ సెంచరీ ద్వారా టెస్టు క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో పాటు ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ద్వారా 15000 పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. 316 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో ఆడుతూ ద్రవిడ్ 14555 పరుగులు చేశాడు. అంతేకాదు, ఒక టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి విరాట్ 50 పరుగుల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి.