భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ స్టేడియంలో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది.
బెంగళూరులో సోమవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం టెస్టు మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఉదయం కూడా మొదలైన వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ రద్దయింది. కాగా, బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం సిరీస్‌లోని తొలి మ్యాచ్ టాస్‌కు ఆటంకం కలిగించింది. దీంతో తొలి రోజు మ్యాచ్ సజావుగా సాగుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వర్షం పడుతున్నప్పటకి ఉదయం నుంచే ప్రేక్షకులు స్టేడియ వద్దకు వచ్చారు. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా ఇరు జట్లు సిరీస్ ఆడుతున్నాయి.
WTC స్టాండింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే బరిలోకి దిగుతోంది. శ్రీలంకతో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైన టిమ్ సౌథీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ సిరీస్ నుంచి న్యూజిలాండ్ జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువీ కరెన్ (రవీంద్ర), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారెల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్మీ సౌత్ రోర్కే