మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ను ఔట్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ చేసిన సెలబ్రేషన్స్ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఈ ఘటనపై మండిపడుతూ, ఐసీసీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
59వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ బౌలింగ్‌కు పంత్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మిచెల్ మార్ష్ చేతికి చిక్కాడు. పంత్ అవుటైన వెంటనే ట్రావిస్ హెడ్ “గ్లాస్‌లో ఫింగర్ తిప్పుతున్నట్లు” అనిపించే విధంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ గెస్ట్‌ను సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు, నెటిజన్లు “అసభ్యకరమైన ప్రవర్తన”గా వ్యతిరేకించారు.
నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “ఇది కేవలం ఒక వ్యక్తిని అవమానించిన ప్రవర్తన కాదు, 150 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనను భవిష్యత్తులో ఎవరూ అనుసరించకుండా ఉండేందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు.
ట్రావిస్ హెడ్ చేసిన ఈ సెలబ్రేషన్స్ పై భారత అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు కూడా మండిపడ్డారు. టీమిండియా మాజీ ఆటగాడు సిద్ధూ, ఈ ప్రవర్తన “జెంటిల్‌మెన్ గేమ్”కు ఏ మాత్రం తగదని, ఇది పిల్లలు, యువకులు, మహిళలు చూస్తున్న సందర్భంలో మరింత బాధాకరమని అన్నారు.
ఆస్ట్రేలియా క్రికెట్ బృందం, అయితే, ఈ వివాదాన్ని తేలిగ్గా తీసుకుంది. కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ట్రావిస్ హెడ్ సెలబ్రేషన్స్‌ను సరదాగా అర్థం చేసుకోవాలని కోరాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సామ్ కాన్‌స్టాంట్స్ మధ్య వాగ్వాదం, యశస్వి జైస్వాల్ ఔట్‌పై అనుమానాస్పద నిర్ణయం కూడా పెద్ద చర్చనీయాంశాలు అయ్యాయి.
Travis head’s obnoxious behaviour during the course of the Melbourne test doesn’t auger well for for the gentleman’s game…… sets the worst possible example when there are kids, women , young & old watching the game……. this caustic conduct did not insult an individual but a…
— Navjot Singh Sidhu (@sherryontopp) December 30, 2024