వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ

వైభవ్ సూర్య వంశీ.. ఐపీఎల్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. 18 సీజన్ల ఐపీఎల్‌లో గొప్ప గొప్ప ఆటగాళ్లంతా నెలకొల్పిన రికార్డులను కేవలం మూడో మ్యాచ్‌తోనే పటా పంచలు చేశాడు. మరో ఆటగాడికి అవకాశం లేకుండా చేయడమే కాదు..ఇంకే ఆటగాడు తన రికార్డులు బద్దలు కొట్టకుండా రికార్డులు బ్రేక్ చేశాడు.

అవును వైభవ్ సూర్య వంశీ..ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త ఘనతను సృష్టించాడు. వైభవ్ సూర్య వంశీ అనే పేరుతో ఉన్న రికార్డును సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో మీడియా, సోషల్ మీడియా తో పాటు అంతర్జాతీయ మీడియా వైభవ్ సూర్య వంశీ నామస్మరణ చేస్తున్నాయి. గుజరాత్ జట్టుపై వీర లెవెల్లో విజృంభించడం వల్ల ..అనేక రికార్డులను సూర్యవంశీ తన పేరు మీద రిజిస్టర్ చేసేసుకున్నాడు.

17 బంతుల్లో వైభవ్ సూర్య వంశీ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు.. ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన వాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా చూసుకుంట రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ 35 బాల్స్ లోనే సెంచూరియన్ అయ్యాడు. 2025 సీజన్లో జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

గుజరాత్‌పై సెంచూరియన్ గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఈ క్రెడిట్ సాధించాడు. గతంలో మహారాష్ట్ర ఆటగాడు విజయ్ 18 ఏళ్ల 118 రోజుల్లో.. 2013లో ముంబై జట్టుపై సెంచరీ చేశాడు. అలాగే 2020లో పర్వేజ్ హో సైన్ అనే ఆటగాడు 18 ఏళ్ల 179 రోజుల వయసులో సెంచరీ చేశాడు. వీరితో పాటు 2022లో గుస్తావ్ మెకాన్ ఫ్రాన్స్ అనే ఆటగాడు 18 ఏళ్ల 280 రోజుల వయసులో స్విట్జర్లాండ్ పై సెంచరీ చేశాడు.