వినేష్ ఫోగట్ ప్రస్తుతం యావత్ క్రీడాలోకం జపిస్తున్న పేరు. పతకం ఖాయమనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ అర్హత కోల్పోయారు. నిన్న 50 కేజీల విభాగంలో సెమీస్‌లో పాల్గొన్న ఈ రెజ్లర్ ఆనందం 24 గంటల్లోనే ఆవిరైంది. బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమెను డిస్‌క్వాలిఫై అయినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫారిస్ ఒలంపిక్స్ లో భారత్‌కు భారీ షాక్ తగిలింది… మహిళల 50 కేజీల గోల్డ్ మెడల్ పోటీ నుంచి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్సలో రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్ వెయిట్ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
50కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా… 100గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు వేశారు.ఇక ఒలంపిక్స్ నిబంధనల ప్రకారం ఫోగట్ 50 కేజీల విభాగంలో వెండి పతకానికి కూడా అర్హురాలు కాదట. 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో పసిడి, కాంస్య పతకం కోసమేపోటీ జరుగనుందని తెలుస్తోంది. పోటీ జరిగే రెండ్రోజుల పాటు రెజ్లర్లు వారికి సంబంధించిన బరువు కేటగిరీకి లోపలే ఉండాలనేది నిబంధన. మంగళవారం రాత్రికి ఆమె 2 కిలోల పాటు అధిక బరువు ఉన్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఈ 2 కిలోల బరువును తగ్గించుకునేందుకు నిద్ర లేకుండా రాత్రి మొత్తం జాగింగ్, స్కిపింగ్, సైక్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె ఇంకా 100 గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు సమాచారం. అయితే భారత క్యాంప్ ఆ 100 గ్రాముల బరువును కోల్పోయేందుకు ఇంకొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఆమెపై అనర్హత వేటు ఖరారైంది.
గత ఏడాది బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేషో ఫోగట్ పోరాడారు. పోలీసు దెబ్బలతో పాటు అవమానాలు ఓర్చుకొని, దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరమైనా… ఎంతో కష్టపడి ఒలంపిక్స్ కు సిద్ధం అయ్యింది వినేష్ ఫోగట్. అంతే పట్టుదలగా ఆడి… తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకుంటున్న చివరి నిమిషంలో 100గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఒలంపిక్స్ ను నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఈరోజు రాత్రి వినేష్ ఫోగట్ బంగారు పతకం కోసం ఆడాల్సి ఉండగా… ఆటకు దూరం కావటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ప్రధాని మోడీ స్పందన
వినేష్ ఫోగట్ నిష్క్రమణపై ప్రధాని మోడి స్పందించారు. వినేష్.. నువ్వు భారత్‌కు గర్వకారణం.. ఎంతో మందికి స్పూర్తిదాయకం, ఛాంపియన్లలో ఛాంపియన్, ఈరోజు ఈ ఎదురుదెబ్బ నిన్ను బాధిస్తుంది. ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి నిలబడ్డావని మాకు తెలుసు. మళ్లీ బలంగా తిరిగి రండి.. మీకోసం ఎదురు చూస్తున్నాం.. అని ఎక్స్ వేధికగా వినేష్ ఫోగట్‌ను ప్రధాని మోడీ ప్రశంసించారు.