స్విస్ ఓపెన్-2022 విజేతగా నిలిచిన పీవీ సింధు, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం జగన్

PV Sindhu Wins Swiss Open-2022 Title PM Modi CM YS Jagan Congratulates Her, PV Sindhu Wins Swiss Open-2022 Title, PM Modi Congratulates PV Sindhu Wins Swiss Open-2022 Title, CM YS Jagan Congratulates PV Sindhu Wins Swiss Open-2022 Title, Swiss Open-2022 Title, Swiss Open-2022, 2022 Swiss Open Title, PV Sindhu, PM Modi, CM YS Jagan, Swiss Open Title, ace shuttler P V Sindhu, ace shuttler P V Sindhu Wins Swiss Open-2022 Title, Swiss Open 2022, Narendra Modi congratulates PV Sindhu on winning Swiss Open, Swiss Open, PV Sindhu Wins Swiss Open-2022, ace shuttler, shuttler P V Sindhu, Swiss Open Title Latest News, Swiss Open Title Latest Updates, Mango News, Mango News Telugu,

భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్‌ ఫైనల్లో విజేతగా నిలిచిన పీవీ సింధు, ఈ ఏడాదిలో రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. బాసెల్‌లో జరిగిన స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ బుసానన్‌ పై 21-16, 21-8 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పీవీ సింధు మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చూపిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకోగా, తాజాగా స్విస్ ఓపెన్‌ విజయంతో ఆమె ఈ ఏడాది రెండో సూపర్ 300 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. మరోవైపు స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఇండోనేషియాకు చెందిన నాలుగో సీడ్‌ జొనాథన్‌ చేతిలో 12-21, 18-21తో ప్రణయ్ ఓడిపోయాడు. కాగా 2016 లో ప్రణయ్‌ స్విస్ ఓపెన్‌ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

స్విస్ ఓపెన్‌ విజేత పీవీ సింధుకు ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ అభినందనలు:

స్విస్ ఓపెన్ 2022 విజేతగా నిలిచిన భారత షట్లర్ పీవీ సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్స్ చేశారు. “”స్విస్ ఓపెన్-2022 గెలిచినందుకు పీవీ సింధుకి అభినందనలు. ఆమె సాధించిన విజయాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ, “స్విస్ ఓపెన్-2022 మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలుగు షట్లర్, దేశానికే గర్వకారణమైన పీవీ సింధుకు అభినందనలు. దేవుని ఆశీస్సులు ఆమెకు ప్రతి ప్రయత్నంలో ఎల్లప్పుడూ ఉండాలి” అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =