ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. స్టార్ ఆటగాళ్లంతా ఇప్పుడు పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. సిరీస్‌ను విక్టరీతో ప్రారంభించిన టీమిండియా, ఆ తర్వాత ఓటమిని చవిచూసింది. మరో మ్యాచ్‌ను మాత్రం డ్రాగా మార్చుకుంది. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ గురించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కొహ్లీ చిన్ననాటి కోచ్.. విరాట్ కొహ్లీ త్వరలోనే భారతదేశాన్ని విడిచిపెడుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.
అవును..విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తాజాగా బాంబు పేల్చారు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో సహా లండన్‌కు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారంటూ ఆయన వెల్లడించారు. కోహ్లీ త్వరలోనే ఇండియా వదిలి లండన్‌కు షిఫ్ట్ అవుతున్నారని రాజ్ కుమార్ శర్మ చెప్పుకొచ్చారు. అయితే విరాట్ కోహ్లీ లండన్ వెళ్లనున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల మధ్య బ్రేక సమయంలో విరాట్ కోహ్లీ తరచుగా లండన్ వీధుల్లో కనిపిస్తుండటంతో.. ఈ పుకార్లకు బీజం పడింది.కానీ ఇప్పుడు ఏకంగా ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.. “అవును, విరాట్ లండన్ వెళ్లాలని యోచిస్తున్నారంటూ.. అతను అతి త్వరలోనే ఇండియా వదిలి వెళ్లిపోతారని చెబుతూ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.దీంతో కొహ్లీ అభిమానులంతా ఇదేంటి కొహ్లీ లండన్ వెళ్లిపోవడం ఏంటని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
మరోవైపు ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ గొప్ప ఫామ్‌లో లేరు. బయటకు వెళ్లే బాల్స్‌ను ఫేస్ చేయడంలోనే నిరంతరం కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా విఫలమయ్యారు. అయితే మెల్‌బోర్న్, సిడ్నీలలో మళ్లీ విరాట్ కోహ్లి తన ఫామ్ అందిపుచ్చుకుంటారని, సెంచరీలు సాధిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.