టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ

Ravindra Jadeja Fined 25 Percent Match Fee for Breaching Level 1 of the ICC Code of Conduct in 1st Test Against Australia,Ravindra Jadeja Stats,Ind Vs Aus,Jadeja News,Ravindra Jadeja,Ravindra Jadeja Century,Mango News,Mango News Telugu,Ravindra Jadeja Chennai Super Kings,Ravindra Jadeja Csk,Ravindra Jadeja Half Century,Ravindra Jadeja Highest Score,Ravindra Jadeja Ipl 2023,Ravindra Jadeja News,Ravindra Jadeja Performance,Ravindra Jadeja Twitter,Sir Ravindra Jadeja

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో 7 వికెట్లు, 70 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా జరిమానా రూపంలో రవీంద్ర జడేజాకు షాక్ తగిలింది. తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు జడేజాకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ప్లేయర్స్ మరియు ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోసం రూపొందించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని రవీంద్ర జడేజా ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆర్టికల్ 2.20 ఆట యొక్క స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి సంబంధించినది. దీనికి అదనంగా జడేజా క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. 24 నెలల వ్యవధిలో ఇది అతని మొదటి అఫెన్స్ గా పేర్కొన్నారు.

తొలిటెస్టులో భాగంగా ఫిబ్రవరి 9, గురువారం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్‌లో జడేజా తన చూపుడు వేలికి సూతింగ్ క్రీమ్/అయింట్మెంట్ రాసుకోవడం కనిపించింది. వీడియో ఫుటేజీలో మహ్మద్ సిరాజ్ అరచేతి నుండి పదార్థాన్ని తీసుకొని దానిని అతని ఎడమ చేతి చూపుడు వేలుకు రుద్దినట్లు కనిపించాడు. కాగా జడేజా తన బౌలింగ్ చేతి చూపుడు వేలుపై వాపుకు క్రీమ్ రాసుకున్నాడని భారత జట్టు మేనేజ్‌మెంట్ వివరించింది. మైదానంలోని అంపైర్ల అనుమతి అడగకుండానే ఇది జరిగింది. జడేజా తన తప్పును అంగీకరించి, ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన జరిమానా ప్రతిపాదనకు అంగీకరించాడు, కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. లెవల్ 1 జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు, మ్యాచ్ రిఫరీ పూర్తిగా వైద్య ప్రయోజనాల కోసమే జడేజా వేలికి క్రీమ్ రాసుకున్నట్టు సంతృప్తి చెందాడు. క్రీం బంతికి కృత్రిమ పదార్ధంగా అంటలేదని, ఆ చర్య బంతి పరిస్థితిని మార్చలేదని రిఫరీ నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజాకు ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ తో పాటుగా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 17-21 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =