టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్రీడాకారుడిగా నిలిచాడు. ఒకవైపు బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్ ఫీజులు, ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో పాటు వాణిజ్య ఒప్పందాలతో మరిన్ని కోట్లు ఆర్జిస్తుంటారు. అదే స్థాయిలో ట్యాక్స్ కూడా కడుతుంటారు. తాజాగా 2024 ఏడాదికి సంబంధించి అత్యధిక టాక్స్ కట్టిన క్రికెటర్ల జాబితా వెల్లడైంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో టాప్ ప్లేస్ సాధించాడు. ఇండియా ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లి రూ.66 కోట్లు చెల్లించాడు. పన్ను చెల్లించే క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ, సెలబ్రిటీల్లో ఓవరాల్ గా ఐదో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 66 కోట్లు పన్నుగా చెల్లిస్తే… భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.38 కోట్లు చెల్లించాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు. పన్ను చెల్లించారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 13 కోట్లు. ఇక టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రూ.10 కోట్లు పన్నుగా తీసుకున్నాడు.
అత్యధిక పన్నులు చెల్లించిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్ షా 92 కోట్లు చెల్లించాడు. తమిళ సూపర్ స్టార్ విజయ్ 82 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబ్ 71 కోట్లు చెల్లించారు. ఓవరాల్ సెలబ్రిటీ జాబితాలో టాప్ టెన్ లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ ఐదో స్థానంలోనూ, ధోనీ ఏడో స్థానంలోనూ , సచిన్ తొమ్మిదో ప్లేస్ లోనూ నిలిచారు. అత్యధిక పన్ను చెల్లించిన టాప్ 20 జాబితాలో హీరోయిన్లు కరీనా కపూర్, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ ఉన్నారు. అయితే టాప్ ట్వంటీలో రోహిత్ శర్మ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది.
FY 2023-24లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న ప్రముఖులు
1.షారుక్ ఖాన్ – రూ. 92 కోట్లు, 2.దళపతి విజయ్ – రూ. 80 కోట్లు, 3.సల్మాన్ ఖాన్ – రూ. 75 కోట్లు, 4.అమితాబ్ బచ్చన్ – రూ. 71 కోట్లు, 5.విరాట్ కోహ్లీ – రూ. 66 కోట్లు, 6.అజయ్ దేవగన్ – రూ. 42 కోట్లు, 7.ఎంఎస్ ధోని – రూ. 38 కోట్లు, 8.రణబీర్ కపూర్ – రూ. 36 కోట్లు, 9.సచిన్ టెండూల్కర్ – రూ. 28 కోట్లు, 10.హృతిక్ రోషన్ – రూ. 28 కోట్లు, 11. కపిల్ శర్మ – రూ. 26 కోట్లు, 12.సౌరవ్ గంగూలీ- రూ. 23 కోట్లు, 13.కరీనా కపూర్ – రూ. 20 కోట్లు, 14.షాహిద్ కపూర్ – రూ. 14 కోట్లు, 15.మోహన్‌లాల్ – రూ. 14 కోట్లు, 16.అల్లు అర్జున్ – రూ. 14 కోట్లు, 17.హార్దిక్ పాండ్యా – రూ. 13 కోట్లు, 18.కియారా అద్వానీ – రూ. 12 కోట్లు
19.కత్రినా కైఫ్ – రూ. 11 కోట్లు, 20.పంకజ్ త్రిపాఠి – రూ. 11 కోట్లు, 21.అమీర్ ఖాన్ – రూ. 10 కోట్లు, 22.రిషబ్ పంత్ – రూ. 10 కోట్లు.
భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు.