అశ్విన్ నా రికార్డును బద్దలు కొడతాడు, 600 వికెట్లు కూడ దాటొచ్చు

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Harbhajan Says Ashwin Will Break His Record, Harbhajan Says Ashwin Will Break His Record 600 Wickets, Harbhajan Says Ashwin Will Break His Record May Go Fast 600 Wickets, Latest Cricket News, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్‌సింగ్‌ మరో భారత జట్టు బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ పై ప్రసంశలు కురిపించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని చెప్పాడు. అదే విధంగా పూర్తి ఫిట్‌నెస్‌తో సుదీర్ఘకాలం పాటు క్రికెట్ లో కొనసాగితే 600 వికెట్లను కూడా దాటేస్తాడని హర్భజన్‌సింగ్‌ చెప్పాడు. అశ్విన్ ఇటీవలే విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టు వరకు 66 టెస్టు మ్యాచుల్లో 350 వికెట్లు తీసాడు. ఈ సందర్భంగా హర్భజన్‌సింగ్‌ స్పందిస్తూ, స్వదేశంలో జరిగే మ్యాచులలో అశ్విన్ బౌలింగ్ సామర్థ్యంపై అనేకమంది మాట్లాడుతుంటారని, ఇవే పిచ్ లపై ఇతర స్పిన్నర్లు సైతం బౌలింగ్ చేస్తారన్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పాడు. వేరే స్పిన్నర్లు అశ్విన్ లా రాణించలేకపోతున్నారని అన్నాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని, పిచ్‌ మారేటప్పుడు ఎలా బౌలింగ్‌ చేయాలో అతనికి పూర్తి అవగాహన ఉంటుందని చెప్పాడు. అశ్విన్ ఫిట్‌గా ఉంటే ఏ రికార్డునైనా అధిగమించగలడన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురిలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. 619 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉండగా, హర్భజన్ సింగ్ (417) వికెట్లతో మూడోస్థానంలో ఉన్నారు. కపిల్ దేవ్ 434 వికెట్లతో 2వ స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో అశ్విన్ ఇప్పటివరకు 350 వికెట్లు తీయగా, స్వదేశంలో ఆడిన 39 మ్యాచ్‌ల్లోనే 242 వికెట్లు పడగొట్టడం విశేషం. మిగిలిన 108 వికెట్లు విదేశీ గడ్డలపై సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 8 =