టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇప్పటికే T-20 కెప్టెన్ గా తనకు తానుగా తప్పుకున్న కోహ్లీని ఇప్పుడు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. వన్డేల్లో వ్యక్తిగతంగా కానీ, కెప్టెన్ గా కానీ, తన ప్రదర్శన మంచిగా ఉన్నప్పటికీ ఒక్క పెద్ద ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేకపోవటం కెప్టెన్ గా అతనికి మైనస్ అయింది. అతని స్థానంలో రోహిత్ శర్మ ని కొత్త కెప్టెన్ గా నియమించారు. ఇప్పటికే T-20 కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వన్డే కెప్టెన్సీతో పాటు టెస్టులకు వైస్ కెప్టెన్ గా కూడా రోహిత్ ని నియమించటం విశేషం.
విరాట్ కోహ్లీ ని ప్రస్తుత క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా కీర్తిస్తారు క్రికెట్ విశ్లేషకులు. తన బ్యాటింగ్ టెక్నిక్ తో పలువురు మాజీల ప్రశంసలు కూడా అందుకున్నాడు. గత దశాబ్ద కాలంగా విరాట్ భారత్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టీమ్ ఇండియాకు అతను ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. కెప్టెన్ గా కూడా అనేక విజయాలు అందుకున్నాడు. తన దూకుడైన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో విరాట్ కోహ్లీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించటంతో విరాట్ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ