త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దుర్మరణం

Air Force chopper crash, Air Force helicopter, CDS Bipin Rawat’s chopper crashes in Tamil Nadu, CDS Gen Bipin Rawat’s chopper crashes in Tamil Nadu, Helicopter with Chief of Defence Staff crashes, Helicopter With General Bipin Rawat Crashes, IAF General Bipin Rawat, IAF General Bipin Rawat His Wife And Others Die, IAF General Bipin Rawat His Wife And Others Die In TN Helicopter Crash, IAF helicopter with CDS Bipin Rawat on board crashes, IAF helicopter with Gen Bipin Rawat on board crashes, IAF Helicopter With General Bipin Rawat Crashes, IAF Helicopter With General Bipin Rawat Crashes In Tamil Nadu, Indian Army helicopter crashes in Tamil Nadu, Mango News, MangoNews, Tamil nadu, TN Helicopter Crash

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ (63) దుర్మరణం పాలయ్యారు. నిన్న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన అసువులు బాసారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది కూడా ఈ ప్రమాదంలో మరణించారు. 14 మంది ప్రయాణం చేస్తున్న ఈ ఛాపర్ లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సైన్యం ఉపయోగించే అత్యాధునికమైన ఛాపర్ ఇలా అకస్మాత్తుగా కూలిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేనివలన ఈ దుర్ఘటన జరిగిందో తెలుసుకోవటంకోసం ఆర్మీ అత్యవసర విచారణ చేపట్టింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా ఈ సంఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారతదేశంలో మొట్ట మొదటి త్రివిధదళాధిపతిగా బిపిన్ రావత్ నియమితులయ్యారు. 2019 ఆగస్టు 15న ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. వచ్చే నెలలో పదవీవిరమణ చేయనున్న ఆయన ఈ ప్రమాదంలో మరణించటం బాధాకర విషయం. 1999లో కార్గిల్ వార్ తర్వాత భారత త్రివిధ దళాలను సమన్వయపరచటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పలు సూచనలు వచ్చాయి. ఈ విషయం గురించి పైస్థాయిలో సమాలోచనలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వాలు మారటం తదనంతర పరిణామాల వలన ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. మోదీ ప్రధాని అయ్యాక బిపిన్ రావత్ ని త్రివిధ దళాధిపతిగా నియమించారు. దేశ రక్షణ విషయాలలో భారత్ వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోవటంలో రావత్ కీలకంగా వ్యవహరించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + five =