
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి అంటే జులై 27 నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఒలింపిక్స్ గేమ్స్ తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌లో భారత్ పాల్గొంటుంది. మొదట జరిగే క్వాలీఫైర్ రౌండ్‌లో క్వాలీఫై అయితే దీనిలో పతకం సాధించే అవకాశాలున్నాయి.
ఒలింపిక్స్ గేమ్స్ లో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 16 విభాగాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్చరీ విభాగాల్లో భారతీయులకు పతకాలు వచ్చే అవకాశాలున్నాయని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో 7 పతకాలు రాగా.. ఈసారి ఆ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.
శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్ క్రీడాకారుల టెన్నిస్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నాగల్.. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న ,ఎన్ శ్రీరామ్ బాలాజీ జోడి పోటీ పడనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 మీటర్ల ఈథర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమాలు పోటీ పడబోతున్నారు. దీని తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వుమెన్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో.. రిథమ్ సాంగ్వాన్ మను భాకర్ పోటీ పడతారు.
బ్యాడ్మింటన్, రోయింగ్, షూటింగ్ ఈవెంట్‌లు శనివారం జరగనున్నాయి. రోవింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ హిట్స్ రౌండ్‌లో బలరాజ్ పన్వార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సందీప్ సింగ్, అర్జున్ బాబౌటా, రమితా జిందాల్, ఎలవెనిల్ వలరివన్ పోటీ పడతారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈ జట్టు అర్హత సాధిస్తే.. మధ్యాహ్నం షూటింగ్‌లో భారత్ పతకం సాధించే అవకాశం ఉంటుంది. దీంతో తొలిరోజు షూటింగ్‌లోనే భారత్ పతకం సాధిస్తుందన్న నమ్మకంతో భారతీయులు ఉన్నారు.
భారత అథ్లెట్లు మొత్తం 7 విభాగాల్లో ఆడనున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రెస్టో జోడీ బరిలోకి దిగబోతోంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ పోటీ పడుతున్నారు. అయితే, మహిళల సింగిల్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు కూడా పోటీ పడబోతోంది. బ్యాడ్మింటన్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఈ రెండింటిలో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు నుంచి మూడు పతకాలు వస్తాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE