వెస్టిండీస్ ఆటగాళ్లకు భారీ జరిమానా

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Slow Over-rate In 1st ODI, sports news, West Indies India, West Indies Players Fined 80 Percent Match Fee, West Indies Vs India 1st ODI, West Indies Vs India ODI Match

భారత్-వెస్టిండీస్‌ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి వన్డేలో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తిచేయని నేపథ్యంలో స్లో ఓవర్‌రేట్ కారణంగా వెస్టిండీస్‌పై ఐసీసీ జరిమానా విధించింది. ఆటగాళ్లందరి మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించింది. నిర్దేశించిన సమయం ముగిసేలోగా వెస్టిండీస్ జట్టు 46 ఓవర్లు మాత్రమే వేయగలిగింది. నిబంధనలను అనుసరించి ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున 4 ఓవర్లకు 80 శాతం మ్యాచు ఫీజు కోత విధిస్తూ రెఫరీ డేవిడ్‌ బూన్‌ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ జరిగిన అనంతరం రెఫరీ ఎదుట వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ జరిమానా ప్రతిపాదనకు ఒప్పుకోవడంతో అధికారిక విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. ముందుగా ఆన్-ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, షాన్ జార్జ్, మూడవ అంపైర్ రోడ్నీ టక్కర్ మరియు నాల్గవ అంపైర్ అనిల్ చౌదరి ఈ అభియోగాన్ని నమోదు చేశారు. నిర్ణిత సమయానికి ఒకటి లేదా రెండు ఓవర్లు తక్కువుగా వేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే వెస్టిండీస్ జట్టు నాలుగు ఓవర్లు తక్కువగా వేసి, స్లో ఓవర్‌రేట్ ఉల్లంఘన కింద భారీ జరిమానాకు గురైంది. ఇక డిసెంబర్‌ 18 బుధవారం నాడు విశాఖపట్నంలో జరిగే రెండో వన్డే మ్యాచ్ కోసం రెండు జట్లు విశాఖ చేరుకొని, పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =