ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లు తదుపరి ఆడే మ్యాచ్ ఎప్పుడు అని అందరి మదిలోనా ఉన్న ప్రశ్న. వెస్టిండీస్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించిన 2024 ICC T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను భారత్ గెలుచుకుంది. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు రెండోసారి కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడు అని వారి ఫ్యాన్స్ ను ఆలోచన చేయడం ప్రారంభించారు. అయితే భారత జట్టు జూలై 6న జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు బరిలో దిగనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జింబాబ్వే పర్యటనకు వెళ్లలేరు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా సహా సీనియర్ ఆటగాళ్లు కూడా జింబాబ్వే పర్యటన నుండి విరామం తీసుకున్నారు.
జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు వన్డేల సిరీస్, టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఆడే అవకాశం ఉంది. ఇక భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి పెడతారని బిసిసిఐ కార్యదర్శి జయ షా ఇప్పటికే చెప్పారు. ఈ రెండు టోర్నీలకు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడనున్నారు. కోహ్లీ, రోహిత్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా టీ20లకు వీడ్కోలు పలికారు. అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డే, టెస్టు క్రికెట్లోనూ ఆడనున్నారు. టీ 20 వల్డ్ కప్ కొట్టిన వీరిద్దరి టార్గెట్ మాత్రం ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్.
టీ20 ప్రపంచకప్ చాంపియన్స్ కి గ్రాండ్ వెల్ కమ్
గురువారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ చాంపియన్ భారత జట్టు ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం టీ20 ప్రపంచకప్ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు అభిమానులతో జరుపుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేశారు. పలు బాలీవుడ్ పాటలకు ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు. ఇక మ్యాచ్ విన్నర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నా దేశం అంటే నాకు ఇష్టం… నా దేశమే నాకు ప్రపంచం.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఇవి నేను ఎప్పటికీ మరచిపోలేని క్షణాలు! వర్షం ఉన్నప్పటికీ మాతో జరుపుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు!మాకు మద్దతుగా ఉన్న 1.4 బిలియన్ల మందికి ధన్యవాదాలు అని ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF