టోక్యో పారాలింపిక్స్‌ లో భారత్ కు పతకాల పంట, స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరా

Avani Lekhara bagged a Gold medal for India at the Tokyo Paralympics, Bhavina Patel & Nishad Kumar win silver medals, Gold medal for India at the Tokyo Paralympics, India Secures 7 Medals Including Gold, India Secures 7 Medals Including Gold PM Tweets Congratulatory Messages, Mango News, PM Narendra Modi Leads Congratulatory Messages, PM Tweets Congratulatory Messages, Tokyo Paralympics, Tokyo Paralympics 2020 Live Updates, Tokyo Paralympics 2021, Tokyo Paralympics 2021 Live

టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే నాలుగు పతకాలు (ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. షూటింగ్ (10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) విభాగంలో భారత మహిళా షూటర్‌ అవని లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారాలింపిక్స్‌ లో భారత్ తరపున స్వర్ణం సాధించిన తోలి భారత మహిళ క్రీడాకారిణిగా 19 ఏళ్ల అవని చరిత్ర సృష్టించింది. అలాగే డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జావెలిన్ త్రోలో (F46 ఈవెంట్) దేవేంద్ర ఝజారియా రజతం పతకం, సుందర్‌ సింగ్‌ గుర్జార్ కాంస్య పతకం సాధించారు.

ఇక ఆదివారం జరిగిన పురుషుల హైజంప్‌ T47 ఈవెంట్ లో భారత క్రీడాకారుడు నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసి రెండో స్థానంలో నిలవడంతో రజతం సాధించాడు. అదేవిధంగా భారత మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు భారత క్రీడాకారుడు వినోద్‌ కుమార్‌ పురుషుల F52 డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కాంస్యం సాధించాడు. అయితే వినోద్ క్లాసిఫికేషన్ పై ఇతర పోటీదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్వాహకులు అతనికి ఇంకా కాంస్య పతకాన్ని అందజేయలేదు. దీనిపై సమీక్ష నిర్వహించి సోమవారం సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 3 =